
జగిత్యాలలో జగన్నాథ రథయాత్ర
జగిత్యాలటౌన్: జిల్లా కేంద్రంలో ఇస్కాన్ మెట్‌పల్లి ఆధ్వర్యంలో మంగళవారం జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్వామివారికి పూజలు చేసి రథాన్ని లాగి భక్తులను ఉత్తేజ పరిచారు. యావర్‌రోడ్డు, తహసీల్ చౌరస్తా, మోచీబజార్, క్లాక్‌టవర్, న్యూబస్టాండ్, నటరాజ్ చౌరస్తా మీదుగా రథయాత్ర సాగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంకీర్తన, ప్రవచనం, మహాహారతి నిర్వహించారు. ఇస్కాన్ ప్రతినిధులు కృష్ణప్రాన్‌జీవన్‌దాస్, ప్రేమానంద్‌గోవింద్‌దాస్, సురనాథ్‌శ్రీనివాస్‌దాస్ పాల్గొన్నారు.