రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం | - | Sakshi
Sakshi News home page

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం

Jul 2 2025 5:44 AM | Updated on Jul 2 2025 5:44 AM

రోడ్ల

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం

● అడుగడుగునా గుంతలే ● మరమ్మతు చేయించని వైనం ● అను నిత్యం ప్రమాదాలు ● వాహనదారులకు తిప్పలు

జగిత్యాల: జిల్లాకేంద్రం.. పైగా గ్రేడ్‌–1 మున్సిపాలిటీ అయిన జగిత్యాలలో రోడ్లన్నీ ఛిద్రంగా మారాయి. అడుగు తీసి అడుగు వేయాలన్నా.. వాహనదారులు వెళ్లాలన్నా.. బస్సులు వెళ్లాలన్నా రహదారులన్నీ గుంతలమయంగా ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. జిల్లా కేంద్రం కావడంతో నిత్యం వందలాది మంది పనుల నిమిత్తం వస్తుంటారు. ప్రధాన కూడళ్లు అయిన కొత్తబస్టాండ్‌, పాతబస్టాండ్‌, తహసీల్‌ చౌరస్తా, టవర్‌సర్కిల్‌, బస్టాండ్‌ ఇన్‌గేట్‌, అవుట్‌గేట్‌, మున్సిపల్‌ చౌరస్తా, మోతె చౌరస్తాలో రోడ్లన్నీ అతిదారుణంగా ఉన్నాయి. ప్రతి చోట పెద్దపెద్ద గోతులు ఉండటంతో వాహనదారులు అందులో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాకాలం అందులో నీరు నిలిచి ఏర్పడకపోవడంతో నేరుగా వాహనదారులు వచ్చి అందులో పడుతున్నారు. వాహనాలు దెబ్బతినడంతోపాటు, వాహనదారులు గాయాలపాలవుతున్నా రు. ఉన్నతాధికారులు స్పందించి గుంతలకు మరమ్మతు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని పార్క్‌ నుంచి కొత్తబస్టాండ్‌కు వెళ్లే రహదారి. ఇటీవల అటువైపుగా ఉన్న సీసీరోడ్డును పని నిమి త్తం తవ్వి వదిలేశారు. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది మంది వెళ్తుంటారు. ఇందులో కనీసం రోజుకు 2– 3 ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్తబస్టాండ్‌కు వెళ్లాలంటే ఇదే రహదారి. కనీసం మరమ్మతు చేపట్టడం లేదు.

ఇది పాతబస్టాండ్‌ చౌరస్తా. ఇక్కడ వందలాది వాహనాలు, ప్రయాణికులు వెళ్తుంటారు. సీసీరోడ్డంతా ఛిద్రంగా మారడంతో పాదచారులకు కష్టతరంగా మారింది. పాఠశాలలు విడిచిన సమయంలో ప్రతిఒక్కరూ ఈ రోడ్డుమీదుగానే వెళ్తుంటారు. కనీసం రోడ్డుకు మరమ్మతులు చేయడం లేదు.

ఇది జిల్లాకేంద్రంలోని వాణిజ్య ప్రాంతమైన టవర్‌సర్కిల్‌. ఇక్కడకు నిత్యం

వందలాది మంది వస్తూపోతుంటారు. ఇక్కడ రోడ్డు మిషన్‌ భగీరథ పనుల నిమిత్తం రోడ్డంతా తవ్వి పైప్‌లైన్‌ వేసి వదిలేశారు. సక్రమంగా కూర్చోకపోవడంతో గుంతలమయంగా మారింది. వాహనదారులు వెళ్లాలన్నా, పాదచారులు నడవాలన్నా ఇబ్బందికరంగా మారింది.

ఈ చిత్రం బైపాస్‌రోడ్‌లోని మోతె వెళ్లే రహదారిలోగల చౌరస్తా. నిత్యం వందలాది వాహనాలు ఇటువైపు వెళ్తుంటాయి. చౌరస్తా మధ్యలోనే పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో వాహన ప్రమాదాలు అనేకంగా జరుగుతున్నాయి. వర్షం పడితే నీరు మొత్తం నిలిచి గుంతలు కనిపించకపోవడంతో అందులో పడి వాహనదారులు గాయాలపాలవుతున్నారు. అధికారులు స్పందించి గుంతలు పూడ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కొత్తబస్టాండ్‌ చౌరస్తా. ప్రతి వాహనం ఈ రహదారి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. మార్గంమధ్యలోనే పెద్ద గుంత ఉండటం అందరికీ సంకటంగా మారింది. వర్షాకాలం కావడం, గుంతల్లో నీరు నిలవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

చర్యలు చేపడతాం

మున్సిపల్‌ పరిధిలో ఉన్న రోడ్లకు మరమ్మతు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. కొన్నిచోట్ల మరమ్మతు చేపట్టాం. మరికొన్ని చోట్ల మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

– స్పందన,

మున్సిపల్‌ కమిషనర్‌

ఇది జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్‌ ఇన్‌గేట్‌. ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే వారు వాహనాలపై వెళ్తుంటారు. ఇది ప్రధాన రహదారి కావడం.. పెద్ద గుంత ఉండడంతో వాహనదారులు అదుపుతప్పి అందులో పడిపోతున్నారు. ఒకానొక సమయంలో బస్సులు కుదుపులకు గురవుతున్నాయి.

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం1
1/7

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం2
2/7

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం3
3/7

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం4
4/7

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం5
5/7

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం6
6/7

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం7
7/7

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement