
స్వశక్తి సంఘాల నిర్వహణ బాధ్యతగా తీసుకోవాలి
జగిత్యాలరూరల్: స్వశక్తి సంఘాల నిర్వహణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పాలమూరు మహా సమైక్య రిసోర్స్ పర్సన్స్ శ్రీలత, సుధారాణి అన్నారు. జిల్లాకేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఇటీవల గ్రామాల్లో ఎంపికై న గ్రామ సంఘం అధ్యక్షులకు మంగళవారం శిక్షణ కల్పించారు. సెర్ప్ ఇందిరాక్రాంతి పథం ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు, 25ఏళ్లలో సాధించిన ప్రగతి అంశాలపై వివరించారు. ప్రస్తుతం చేపట్టిన కార్యక్రమాలతోపాటు సెర్ప్ సిబ్బంది వీవోఏలు విధులు, బాధ్యతలు, గ్రా మ సంఘం బాధ్యతలు, గ్రామ సంఘం ద్వా రా స్వశక్తి సంఘాల పర్యవేక్షణ, పుస్తకాల నిర్వహణ, కట్టుబాట్లు, అమలు, ఉత్తమ గ్రామ సంఘం, మహాసభ అధికారాలపై వివరించారు. ఏపీఎం గంగాధర్, సీసీ విద్యాసాగర్, మండల సమైక్య అధ్యక్షురాలు దేశవేని గంగభవాని, కార్యదర్శి జమున, కోశాధికారి సుమలత, సిబ్బంది పద్మ, సురేందర్, అశోక్ పాల్గొన్నారు.
కార్మికుల సమ్మె నోటీసు
జగిత్యాల: తమ సమస్యలు పరిష్కరించాలని, తాగ్యాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కా ర్మికులు లేబర్ ఆఫీసర్‌కు మంగళవారం సమ్మె నోటీస్ అందించారు. నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి వాటిని అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కార్మిక సంఘం నాయకులు అన్నారు. దేశంలోని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈనెల 9న సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. నాయకులు సుతారి రాములు, శ్రీకాంత్, ముక్రం, లక్ష్మీ, భూమేశ్వర్ పాల్గొన్నారు.

స్వశక్తి సంఘాల నిర్వహణ బాధ్యతగా తీసుకోవాలి