
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
జగిత్యాలక్రైం: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, అలాంటి వారిపై రౌడీషీట్ ఓపెన్ చే యాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నేరాలపై సమీ క్షించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరి ష్కరించాలన్నారు. సీసీ కెమెరాల పనితీరును ప్రతిరోజూ చెక్ చేసుకోవాలన్నారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐ లు శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, రఫీక్‌ఖాన్, శ్రీని వాస్, సుధాకర్, కరుణాకర్, రాంనర్సింహా రెడ్డి, రవి, సురేశ్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌కుమార్, వేణు, ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో సిటీ పోలీస్‌యాక్ట్ అమలు
శాంతిభద్రతల నేపథ్యంలో ఈ నెల 31 వరకు జిల్లావ్యాప్తంగా సిటీ పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్రజ లు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నర్సయ్య
జగిత్యాలజోన్: జిల్లా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు (సబ్ కోర్టు) అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బిట్ల నర్సయ్యను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన నర్సయ్య 25 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.
జిల్లాకు తేలికపాటి వర్ష సూచన
జగిత్యాలఅగ్రికల్చర్: రానున్న ఐదురోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు గంటలకు 13 నుంచి 22 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలరూరల్: వర్షాకాలం నేపథ్యంలో సీజ నల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అ న్నారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించారు. ఇళ్లలో శుభ్రత పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురుగునీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలని, ఎక్కడైనా నిల్వ ఉంటే ఆయిల్‌బాల్స్ వేయాలని సూచించారు. నీటిని శుద్ధి చేసుకుని తాగాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. మెడికల్ ఆఫీసర్ సౌజ న్య, లావణ్య, ఏఎన్‌ఎం సుగుణ పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ ఓటింగ్‌లో పాల్గొనాలి
జగిత్యాలరూరల్: జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025 ఓటింగ్‌లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని ఎస్‌బీఎం జిల్లా కో–ఆర్డినేటర్ హరిణి అన్నారు. మంగళవారం ఐకేపీ కార్యాలయంలో గ్రామ సమైక్య అధ్యక్షులు, సిబ్బందికి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ ఓటింగ్‌పై అవగాహన కల్పించారు. పరిశుభ్రత ర్యాంకింగ్‌లో కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో పరిశుభ్రత గురించి సిటిజన్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోందని, ఓటింగ్‌లో స్వచ్ఛందంగా పాల్గొని జిల్లా ప్రథమస్థానంలో ఉండేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో 10 శాతం ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని, యాప్‌లో అడిగే 13 రకాల ప్రశ్నలకు ఓటింగ్ ద్వారా జవాబు తెలపాలన్నారు.