అందని ‘ఉపాధి’ కూలి | - | Sakshi
Sakshi News home page

అందని ‘ఉపాధి’ కూలి

Jul 3 2025 5:32 AM | Updated on Jul 3 2025 5:32 AM

అందని

అందని ‘ఉపాధి’ కూలి

వస్తాయని చెబుతున్నారు

ఏప్రిల్‌, మే నెలలో చేసిన పపనులకు ఇప్పటివరకు డబ్బులు రాలేదు. పంచాయతీ కార్యదర్శిని పలుమార్లు అడిగితే వస్తాయని చెబుతున్నారు. మండుటెండలను లెక్క చేయక ఉపాధిహామీ పనులకు పోయాం. దూరం ఎంతైన నడిచే వెళ్లాం. పనులు చేసి నెలల తరబడి పైసల కోసం ఎదురు చూస్తున్నాం.

– మల్యాల విజయ, కూలీ పెగడపల్లి

రెండు నెలల బిల్లు రావాలి

రెండు నెలల కూలీ డబ్బులు రావాలి. పనులు చేసినా సకాలంలో వేతనాలు సరైన సమయంలో చెల్లించడం లేదు. ఎండకాలంలో ఉపాధి పనులకు వెళ్లాం. కానీ ఇప్పటి వరకు ఆ పనులకు సంబంధించిన వేతనాలు రాలేదు. పెండింగ్‌లో ఉన్న కూలీ డబ్బులు చెల్లించాలి. లేకుంటే మాకు పస్తులే.

– సాతి మల్లయ్య, పెగడపల్లి

పెగడపల్లి: చేసిన పనికి కూలి అందక ఉపాధికూలీలు ఎదురుచూస్తున్నారు. పనులు చేసి రెండు నెలలు దాటినా ఖాతాల్లో నగదు జమ కావడంలేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి డబ్బులు జమ చేయాలని కోరుతున్నారు. పేద కూలీలకు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. ఎండ, వాన లెక్కచేయకుండా ఉపాధిహామీ పథకం పనికి వెళుతున్నారు. వీరికి అందించాల్సిన వేతనాలు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని కూలీలు వాపోతున్నారు. ఉపాధి చట్టం ప్రకారం 14 రోజుల్లో చేసిన పనులకు కూలీ చెల్లించాల్సి ఉంటుంది. నెలల తరబడి కూలీ చెల్లించకపోవడంతో తాము ఆర్థికంగా అవస్థలు పాలవుతు న్నామని అంటున్నారు. నిత్యం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందంటున్నారు. జిల్లాలోని 380 గ్రామ పంచాయతీల పరిధిలో పనులను గుర్తిస్తూ ఉపాధిహామీ ద్వారా కూలీలకు పనులు కల్పిస్తూ ఆర్థిక భరోసానిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం కూలీలు 1,38,823 మంది కూలీలు నమో దై ఉన్నారు. మొత్తం 1,67,461 జాబ్‌ కార్డులుండగా 1,00,723 యాక్టివ్‌ జాబ్‌ కార్డులున్నాయి. రెండు నెలలకు సంబంధించి రూ.1,25,26,813 పెండింగ్‌లో ఉన్నాయి. తమకు రావాల్సిన వేతనాలు చెల్లించి తమను ఆదుకోవాలని ఉపాధిహామి కూలీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

నిధులు రాగానే ఖాతాల్లో జమ

ఉపాధి పనులు చేసిన ప్రతి కూలికి డబ్బులు వస్తాయి. పనుల్లో పాల్గొన్న ప్రతి కూలీ వివరాలు ఆన్‌లైన్‌ చేశాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. రాగానే నేరుగా ఖాతాల్లో జమ చేస్తారు. – రఘువరన్‌ డీఆర్డీవో

రెండు నెలలుగా నిలిచిన బిల్లులు

జిల్లాలో రూ.1,25,26,813 బకాయిలు

మొత్తం జాబ్‌ కార్డులు 1,67,461

యాక్టివ్‌ జాబ్‌కార్డులు 1,00,723

కూలీలు 1,38,823

అందని ‘ఉపాధి’ కూలి1
1/3

అందని ‘ఉపాధి’ కూలి

అందని ‘ఉపాధి’ కూలి2
2/3

అందని ‘ఉపాధి’ కూలి

అందని ‘ఉపాధి’ కూలి3
3/3

అందని ‘ఉపాధి’ కూలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement