
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జగిత్యాలరూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలానికి చెంది న 99మందికి రూ.28.14 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్, 86మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపి ణీ చేశారు. కాంగ్రెస్ రైతుపక్షపాతి ప్రభుత్వమన్నారు. సన్నబియ్యం, కరెంట్, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, మహిళసంఘాలకు ఆర్థిక చేయూత వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, నాయకులు ర వీందర్‌రెడ్డి, పాలెపు రాజు, ముకుందం, జాన్, మ ల్లారెడ్డి, బోనగిరి నారాయణ, నరేశ్ పాల్గొన్నారు.
డేకేర్ ఏర్పాటు చేయండి
జగిత్యాల: సీనియర్ సిటిజన్స్ కోసం డేకేర్ ఏర్పాటు చేయాలని సీనియర్ సిటిజన్స్ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఆయన మంత్రి లక్ష్మణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లి కేంద్రం ఏర్పాటు చేసేలా చూస్తానన్నారు. హరి అశోక్‌కుమార్, విశ్వనాథం, హన్మంతరెడ్డి పాల్గొన్నారు.
పట్టణాభివృద్ధికి కృషి
జగిత్యాల పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. పలు వార్డుల్లో రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.140 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.