
పథకాలను ప్రజల వద్దకు చేర్చాలి
జగిత్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు చేర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో అలసత్వం వద్దని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి
జగిత్యాలక్రైం: సైబర్ నేరాలు, భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల నుంచి సైబర్ జాగృక్త దివాస్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, యువతకు సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో సైబర్ నేరాలను నివారించడమే లక్ష్యంగా విద్యార్థులు, యువతకు, ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం వాడకుండా తల్లిదండ్రుల జాగ్రత్తలు పాటించాలన్నారు.
టీబీ ముక్త్ భారత్ దిశగా కృషి చేయాలి
మల్యాల: టీబీ ముక్త్ భారత్ దిశగా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా ఉప వైద్య,ఆరోగ్య శాఖ అధికారి ఎన్.శ్రీనివాస్ అన్నారు. మల్యాల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్య,ఆరోగ్య శాఖ అధికారి ఎన్.శ్రీనివాస్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా నమోదైన రోగుల ఆన్‌లైన్ వివరాల నమోదును పరిశీలించారు. ఆన్‌లైన్ నమోదు త్వరగా పూర్తి చేసి, ఆరోగ్య సిబ్బంది ఇంటింటా తిరుగుతూ, టీబీ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించాలన్నారు. దీర్ఘకాలికంగా పొడిదగ్గు, జ్వరం, హఠాత్తుగా బరువు తగ్గినట్లయితే టీబీ పరీక్ష చేయించుకోవాలని, కార్యక్రమంలో వైద్యులు మౌనిక, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులు శాసీ్త్రయ
దృక్పథాన్ని అలవర్చుకోవాలి
రాయికల్: విద్యార్థులు చదువుతున్న సమయంలో శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని భూ భౌతిక శాస్త్రవేత్త లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం రాయికల్ మండలం ఇటిక్యాల ఉన్నత పాఠశాలను సందర్శించి మాట్లాడారు. చిన్నతనం నుంచే శాస్త్ర విజ్ఞానాన్ని అలవర్చుకుంటే ప్రతి అంశంపై ఆలోచించే శక్తి పెరుగుతుందన్నారు. సైన్స్ టీచర్లు చెప్పే పాఠశాలను బట్టి పట్టడం కంటే అర్థం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సదాశివ్, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పథకాలను ప్రజల వద్దకు చేర్చాలి

పథకాలను ప్రజల వద్దకు చేర్చాలి

పథకాలను ప్రజల వద్దకు చేర్చాలి