
గోరింట పూసింది
అంజన్నకు వరదపాశం
వైభవంగా బోనాలు
7
జిల్లాకు తేలికపాటి వర్ష సూచన
జగిత్యాల అగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదురోజుల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 29–32 డిగ్రీల సెల్సియస్‌గా, రాత్రి ఉష్ణోగ్రతలు 25–26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమ ఉదయం 79–84శాతం, మధ్యాహ్నం 56–63శాతం నమోదయ్యే అవకాశముందన్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మల్లాపూర్/మల్యాల: ఆషాఢమాసంలో గోరింటాకు సందడి కనిపిస్తోంది. మహిళకు ఎంతో ఇష్టమైన గోరింటాకును పెట్టుకుంటూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లాపూర్ మోడల్ స్కూల్‌లో శుక్రవారం గోరింటాకు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీచర్లు, విద్యార్థినులు చేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. మల్యాలలో ఉషోదయ మండల సమాఖ్య ఆధ్వర్యంలో గోరింటాకు సంబురాలు నిర్వహించుకున్నారు. స్థానిక సెర్ప్ కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆమని ఆధ్వర్యంలో వీవోఏలు రెండు చేతులకు గోరింటాకు పెట్టుకొని సంబురాలు చేసుకున్నారు.
మల్యాల: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ మల్యాల మండలం ముత్యంపేటలో రైతులు శుక్రవారం వరదపాశం నిర్వహించారు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి బిందెలతో జలాభిషేకం చేశారు. దిగువ కొండగట్టు వద్ద విగ్రహం వద్దకు వెళ్లి, బెల్లంతో కూడిన వరదపాశం నైవేద్యంగా సమర్పించారు. మాజీ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, పాక్స్ డైరెక్టర్ సంత ప్రకాశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇబ్బంది లేకుండా చూస్తాం
వ్యర్థాలు తొలగించాలి
మున్సిపాలిటీల్లో 100 రోజుల కార్యాచరణలో భాగంగా డ్రైనేజీలు, వాగులు, ప్రభుత్వ భూములలో సీల్టు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నాలాలను శుక్రవారం పరిశీలించారు. గోవిందుపల్లి కాలనీ, గంజ్‌రోడ్, శంకులపల్లిలో ఉన్న నాలాలను వెంటనే శుభ్రపర్చాలని ఆదేశించారు. ప్రైవేటు భూ ముల యజమానులు తమ భూ ముల్లోని ముళ్లపొదలను తొలగించకపోతే జరిమానాలు విధించి ఆ డబ్బుతో శుభ్రం చేయాలన్నారు. కలెక్టర్ వెంట కమిషనర్ స్పందన, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.
ప్రధాన మురుగు కాలువలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. 100 రోజుల ప్రణాళికలో భాగంగా నాలాలోని చెత్తాచెదారం తొలగించడం జరిగింది. పూర్తిస్థాయిలో తీయించేలా చర్యలు తీసుకుంటున్నాం. వర్షకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.– స్పందన, మున్సిపల్ కమిషనర్

గోరింట పూసింది

గోరింట పూసింది

గోరింట పూసింది

గోరింట పూసింది

గోరింట పూసింది

గోరింట పూసింది

గోరింట పూసింది