
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
● ఎస్పీ అశోక్‌కుమార్
ఇబ్రహీంపట్నం: విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ అశోక్‌కుమార్ సిబ్బంది కి సూచించారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. డీఎస్పీ రాములు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పోలీస్ కీట్లను పరిశీలించారు. స్టేషన్‌లో రికార్డులు, కేసుల నమోదు వివరాలు, క్రైం వివరాలపై ఆరా తీశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. సీఐ అనిల్‌కుమార్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల ఎస్సైలు అనిల్, రాజు, శ్రీధర్ పాల్గొన్నారు.
రోశయ్యకు నివాళి
జగిత్యాలక్రైం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రిగా రోశయ్య ఘనత సాధించారని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌కుమార్, వేణు, ఐటీకోర్ ఇన్‌స్పెక్టర్ రఫీక్‌ఖాన్, ఫింగర్ ప్రింట్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు.