
దొడ్డి కొమురయ్యకు నివాళి
జగిత్యాలటౌన్: తెలంగాణ ప్రజల తెగువ, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక దొడ్డి కొమురయ్య అని అదనపు కలెక్టర్ బీఎస్.లత కొనియాడారు. దొడ్డి కొమురయ్య వర్ధంతిని శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి సునీత, మైనార్టీ అధికారి ఆర్‌ఎస్.చత్రు పాల్గొన్నారు. జగిత్యాలలోని 1వ వార్డులో ఉన్న దొడ్డికొమురయ్య విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షుడు ముసిపట్ల లక్ష్మీనారాయణ తదితరులు నివాళి అర్పించారు.
రైతు సేవల్లో సహకార సంఘాలు కీలకం
కథలాపూర్/మల్లాపూర్: రైతులకు సేవలందించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్, జిల్లా ఆడిట్ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా సహకార సంఘాలు అందిస్తున్న సేవలపై శుక్రవారం కథలాపూర్, మల్లాపూర్ జెడ్పీ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించి పంటల పెట్టుబడికి ప్రోత్సాహం ఇస్తున్నామని వివరించారు. రైతులతోపాటు వ్యాపారులకు రుణాలు ఇస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లు పంపిణీ చేశారు. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటారు. ఎంఈవోలు శ్రీనివాస్, దామోదర్‌రెడ్డి, మల్లాపూర్ తహసీల్దార్ రమేశ్‌గౌడ్, ఎంపీడీవో శశికుమార్‌రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
మల్యాల: విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించడంతోపాటు, సబ్జెక్టులవారీగా సామర్థ్యాన్ని పరీక్షిస్తూ, వారి భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బొప్పరాతి నారాయణ సూచించారు. మల్యాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం సందర్శించారు. అధ్యాపకుల హాజరు రిజిస్టర్లు, కార్యాలయ రికార్డులు పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో చదువుతూ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అధ్యాపకులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ, వారిలోని సృజనాత్మకతకు పదును పెట్టాలని పేర్కొన్నాఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జి.వాణి, అధ్యాపకులు అత్తినేని శ్రీనివాస్, మహమ్మద్ నవాబ్, వేనపెల్లి సంధ్య, లైబ్రేరియన్ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
మహిళా సంఘాల అభ్యున్నతికి కృషి
జగిత్యాలరూరల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభ్యున్నతికి కృషి చేస్తోందని డీఆర్డీ ఏ పీడీ రఘువరణ్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామంలో ఇందిర మహిళ శక్తి పెట్రోల్‌బంక్ స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి ఇందిర మహిళా శక్తి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలో జిల్లా మహిళా సమైక్యకు పెట్రోల్‌బంక్ మంజూరైందన్నారు. సెర్ఫ్ సీఈవో, కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. పెట్రో ల్ బంక్‌ను పూర్తిగా మహిళా సంఘ సభ్యులే నిర్వహిస్తారని, అందుకోసం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించడం జరిగిందన్నారు. రూరల్ తహసీల్దార్ శ్రీనివా స్, జిల్లా సెర్ఫ్ ఏపీడీ సునీత, పెట్రోల్‌బంక్ ప్ర తినిధి హర్షవర్దన్, డీపీఎం విజయభారతి, ఏపీఎం గంగాధర్, సీసీ గంగారాం పాల్గొన్నారు.

దొడ్డి కొమురయ్యకు నివాళి