
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు
కలెక్టర్ సత్యప్రసాద్
ధర్మపురి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. పైఅంతస్తులో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. డెంగీ, మలేరియాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. గోదావరి వరదలతో కలుగుతున్న నష్టాలపై ఆరా తీశారు. ఈ సారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త భవనం కోసం నివేదికలు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇన్‌చార్జి తహసీల్దార్ సుమన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. హౌసింగ్ అధికారులతో సమావేశమయ్యారు. లబ్ధిదారులు నిర్ణీత గడువులోపు నిబంధనల మేరకు పనులు పూర్తి చేసుకోవాలన్నారు. అధికారులు వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ లత, హౌసింగ్ డీఈ భాస్కర్, డీఆర్డీఏ పీడీ రఘువరణ్, డీపీవో మదన్‌మోహన్ పాల్గొన్నారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా సమగ్ర రైతు సహకార సంస్థ ప్రతినిధులు కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో చేపట్టబోయే ఐఎఫ్‌సీవో కార్యక్రమాలపై ఆయనకు వివరించారు. ఐఎఫ్‌సీవో ప్రాజెక్ట్ మేనేజర్ స్వప్నరెడ్డి, మేనేజర్ రమ్యశ్రీ, లహరి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఈవీఎం గోదాముల తనిఖీ
జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లో గల ఈవీఎం గోదాంను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల భద్రతపై ప్రతినెలా తనిఖీ ఉంటుందన్నారు.