
ఆధునిక హంగులతో పెద్దాపూర్ ‘గురుకులం’
మెట్‌పల్లిరూరల్: ఏళ్ల నుంచి సమస్యలతో కొట్టుమిట్టాడిన మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకులం పాఠశాల నేడు ఆధునిక హంగులతో కళకళలాడుతోంది. కొంతకాలంగా వివిధ కారణాలతో సమస్యలు ఎదుర్కొన్న పాఠశాల ప్రస్తుతం పూర్తిగా మార్పు చెందింది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వసతులు మెరుగుపర్చారు. భద్రతపై దృష్టి సారించారు. కొత్త భవనంలోని కొన్ని గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన గదులను వసతి, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. గతంలో ఇక్కడ జరిగిన ఘటనల దృష్ట్యా భద్రతపై దృష్టిసారించిన అధికారులు.. నిధులు వెచ్చించి పనులు చేయించారు. గురుకులం పరిసరాల్లో సీసీ వేయించారు. చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరిసరాలను ఎప్పటికప్పడు శుభ్రం చేయిస్తున్నారు. సుమారు
రూ.60 లక్షలు వెచ్చించి గురుకుల పాఠశాలను బాగు చేయించారు.

ఆధునిక హంగులతో పెద్దాపూర్ ‘గురుకులం’

ఆధునిక హంగులతో పెద్దాపూర్ ‘గురుకులం’

ఆధునిక హంగులతో పెద్దాపూర్ ‘గురుకులం’