
ఓటరు నమోదు పారదర్శకంగా చేయాలి
రాయికల్: ఓటరు నమోదు ప్రక్రియను బూత్ లెవల్ అధికారులు పారదర్శకంగా చేయాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బూత్‌స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆగస్టులో నిర్వహించే ఓటరు నమోదు ప్రక్రియలో నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ వంటి అంశాలపై పూ ర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. బీ ఎల్వోలు పారదర్శకంగా వ్యవహరించాలని, స కా లంలో పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీ వి, ట్రైనర్లు రాజశేఖర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు గురుకులం విద్యార్థులు
మల్యాల: మండలంలోని తాటిపల్లి బాలికల గురుకులం విద్యార్థులు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక తెలిపారు. గురుకులానికి చెందిన ఎ.హర్షిత్ అండర్–14 లాంగ్‌జంప్ విభాగంలో, జి.హారిక అండర్–12 లాంగ్‌జంప్ విభాగంలో ఈనెల 6న హన్మకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్, పీఈటీ, ఉపాధ్యాయులు అభినందించారు.
భగీరథ లీకేజీలకు
మరమ్మతులపై నిర్లక్ష్యం
మెట్‌పల్లి: పట్టణంలోని వెంకట్రావ్‌పేట వద్ద జాతీయ రహదారి పక్కన రెండు రోజుల క్రితం భగీరథ పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడి భారీగా నీరు వృథాగా పోతుంది. దీనివల్ల అటు వైపు వెళ్లే వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తరుచుగా పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడుతున్నాయి. అధికారులు మరమ్మతులు చేపడుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుందని సింగిల్ విండో చైర్మన్ కొమిరెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు. లీకేజీలు ఏర్పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఓటరు నమోదు పారదర్శకంగా చేయాలి

ఓటరు నమోదు పారదర్శకంగా చేయాలి