
మొక్కలు నాటి సంరక్షించాలి
జగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్/జగిత్యాలటౌన్: మొక్కలను నాటడంతో పాటు సంరక్షించడం ప్రధానమని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం–2025 సందర్భంగా జగిత్యాల సహకార సంఘంలో శుక్రవారం వనమహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ఏక్ పేడ్ మా కే నామ్ పేరిట సహకారశాఖ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో ఒకేరోజు 2,500 మొక్కలు నాటామని జిల్లా సహకారాధి కారి మనోజ్‌కుమార్ తెలిపారు. ఆర్డీవో మధుసూధన్, జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, సంఘ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
రోశయ్యకు నివాళి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతిని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సత్యప్రసాద్ రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
వ్యాధులు ప్రబలకుండా చూడాలి
ప్రతి మున్సిపాలిటీలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. అమినీబాద్‌లో శుక్రవారం పర్యటించా రు. కూలర్లు, వాడి పడేసిన పాత టైర్లు, కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ గ్లాసులు వంటివి పరిసరాల్లో ఉండకుండా చూడాలని ఆదేశించారు. నీరునిల్వ ఉన్న చోట ఆయిల్‌బాల్స్ వేయాలన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన పాల్గొన్నారు.
సీఎంఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలి
సీఎంఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. రా, బాయిల్డ్ రైస్‌మిల్లర్లతో సమావేశం అయ్యారు. సీఎంఆర్ చెల్లింపులు ఈనెల 27తో ముగుస్తున్నాయని, నిర్ణీత గడువులోగా మిల్లర్లు చెల్లించాలని ఆదేశించారు. లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ లత, డీఎస్‌వో జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పురాణిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్‌చార్జి డీఈవో సత్యనారాయణ, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్