
రెండు పోస్టులు.. ఒక్క అధికారి
మల్యాల: ఓ వైపు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద బందోబస్తు పర్యవేక్షణ.. మరోవైపు మండలంలోని 19 గ్రామాల నుంచి వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన.. ఇంకో వైపు ఆలయానికి, మండలానికి వచ్చే అధికారులు, ప్రజా ప్రతినిధుల ప్రొటోకాల్ నిర్వహణ.. పెట్రోలింగ్, ఇతర కేసుల దర్యాప్తుతో పని ఒత్తిడి ఉంటుందని మల్యాల పోలీసుస్టేషన్‌కు గతంలో ఇద్దరు ఎస్సైలను కేటాయించారు. కొన్నాళ్ల పాటు కొనసాగగా.. తరువాత ఒక్క ఎస్సైతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో సత్వర సేవలు అందక మండల ప్రజలు స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. రెండో ఎస్సై పోస్టు ఉన్నా లేనట్టే అన్నచందంగా మారిందని పేర్కొంటున్నారు.
బాధితుల పడిగాపులు..
మండలంలో 19 గ్రామాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఉండడంతో మల్యాల మండల పోలీస్‌స్టేషన్‌కు గతంలో ఇద్దరు ఎస్సైలను కేటాయించారు. ఆలయానికి వచ్చే భక్తులు, ప్రముఖుల భద్రత కోసం రెండో ఎస్సైకి విధులు కేటాయించేవారు. మండలంలోని సగం గ్రామాలతోపాటు ప్రొటోకాల్ విధులు నిర్వర్తించేవారు. కొన్నాళ్లు రెండో ఎస్సై కొనసాగగా.. ఐదేళ్లుగా ఒక్క రే ఎస్సై విధులు నిర్వహిస్తున్నారు. సదరు అధికారి జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తుండడంతో ఫిర్యాదుదారులు రోజంతా స్టేషన్ వద్ద ఎస్సై కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.
జిల్లాబాస్ దృష్టిసారించాలి
మల్యాల పోలీస్‌స్టేషన్‌పై జిల్లా పోలీస్‌బాస్ దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు కోరుతున్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండగట్టు ఆలయం, ప్రముఖుల పర్యటనలు, తరచూ జరుగుతున్న నేరాల పర్యవేక్షణతో ఉన్న ఒక్క ఎస్సైకి భా రం పడుతోందని అంటున్నారు. రెండో ఎస్సై పోస్టు ను తక్షణమే భర్తీ చేయాలని కోరుతున్నారు. ‘ప్రస్తు తం సిబ్బంది కొరత ఉంది. కొత్త అధికారులు రాగా నే మల్యాల పోలీసుస్టేషన్‌కు రెండో ఎస్సైని నియమిస్తాం’ అని ఎస్పీ అశోక్ కుమార్ వివరించారు.
మల్యాల పోలీస్‌స్టేషన్‌లో రెండో ఎస్సై లేక ఇబ్బంది
గంటల తరబడి పడిగాపులు కాస్తున్న ఫిర్యాదుదారులు
ప్రొటోకాల్, ఫీల్డ్ ఎంకై ్వరీలతో ప్రస్తుత ఎస్సై బిజీబిజీ