వైభవంగా నృసింహుని నవరాత్రోత్సవాలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో నవరాత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో రెండోరోజైన ఆదివారం ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉదయం గోదావరినదికి మంగళ వాయిద్యాలతో వెళ్లి బిందే తీర్థం తెచ్చి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ట్రస్టుబోర్డు చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు, వేదపండితులు తదితరులున్నారు.
9
10లోu
వ్యవసాయ బావుల్లో అడుగంటిన నీరు
చెరువుల్లో తగ్గిన నీరు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. వేసవిలో రోజువారి అవసరాలకు నీటి వినియోగం ఎక్కువ కావడంతో.. నీటిమట్టాలు తగ్గిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కేవలం ఒక్క ఏప్రిల్‌లోనే నీటిమట్టం 0.33 మీటర్లకు పడిపోయింది. ఇక అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే మేలో నీటిమట్టం మరెంత పడిపోతుందోనని ఆందోళన మొదలైంది.
మున్సిపాలిటీల్లో
పెరుగుతున్న నీటి వినియోగం
జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయిక ల్, ధర్మపురి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ పట్ట ణాల్లో నీటి వినియోగం పెరిగిపోయి భూగర్భజ లం తగ్గుముఖం పట్టడానికి కారణమవుతోంది. ఇంటికో బోరు ఉండడం.. ఇష్టం వచ్చి నట్లు నీటి ని వినియోగిస్తుండడంతో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఏప్రిల్‌లో మున్సిపాలిటీల్లో పడిపోయిన నీటిమట్టాలను పరిశీలిస్తే.. జిల్లాకేంద్రంలో 8.45 మీటర్లు, కోరుట్ల పట్టణంలో 9.75, మెట్‌పల్లిలో 5.87, రాయికల్‌లో 4.10, ధర్మపురిలో 6.21 మీటర్లకు భూగర్భజలమట్టం పడిపోయింది.
నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి
జిల్లాలో నాన్ ఆయకట్టు ప్రాంతాలైన మల్యాల, మేడిపల్లి, కథలాపూర్, కొడిమ్యాల, భీమారం మండలాల్లో భూగర్భజలాలు మరింతగా పడిపోతున్నాయి. మల్యాల మండలంలో 7.71మీటర్లు, కొడిమ్యాలలో 13.14, కథలాపూర్‌లో 3.02, మేడిపల్లిలో 4.84, భీమారంలో 4.75మీటర్లకు నీటిమట్టం పడిపోయింది.
ఒక్కనెలలోనే పడిపోయిన
0.33 మీటర్ల నీటిమట్టం
జిల్లాలో ఒక్కనెలలోనే నీటిమట్టం సగటున 0.33 మీటర్లకు పడిపోయింది. మార్చిలో 5.24 మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఏప్రిల్ చివరినాటికి 0.33 మీటర్లు పడిపోయి.. ప్రస్తుతం 5.57 మీటర్లకు చేరుకుంది. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏడాది 0.13 మీటర్లు తగ్గింది. ఏప్రిల్ చివరి నాటికి బీర్పూర్ మండలంలో అతి తక్కువ లోతు 2.34 మీటర్ల లోతులో నీరు ఉండగా.. అత్యధికంగా 13.14 మీటర్ల లోతులో కొడిమ్యాలలో నీరు ఉండటం గమనార్హం. ఆయకట్టు మండలాల్లోనూ నీటి మట్టం పడిపోతూనే ఉంది. బుగ్గారంలో 5.41 మీటర్లు, ఎండపల్లిలో 9.50, గొల్లపల్లిలో 5.13, జగిత్యాల రూరల్‌లో 3.11, పెగడపల్లిలో 5.12, సారంగాపూర్‌లో 6.04, వెల్గటూర్‌లో 3.89, ఇబ్రహీంపట్నంలో 4.81, మల్లాపూర్ మండలంలో 6.57 మీటర్ల మేర భూగర్భజల మట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
38.0/27.0
గరిష్టం/కనిష్టం
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లో 5.57 మీటర్ల దిగువకు ఒక్క నెలలోనే 0.33 మీటర్లు
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లు
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లు
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లు
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లు
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లు
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లు
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లు