
నీట్ పరీక్ష ప్రశాంతం
జగిత్యాల: జిల్లాలోని రెండు కేంద్రాల్లో నిర్వహించిన నీట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నాచుపల్లి జేఎన్టీయూ కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. అక్కడి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఒక సెంటర్‌లో 480, రెండో సెంటర్లో 278 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. ఒక కేంద్రంలో 13 మంది, మరో కేంద్రంలో ఐదుగురు గైర్హాజరైనట్లు వివరించారు. ఆర్డీవో మధుసూదన్, జేఎన్టీయూ ప్రిన్సిపల్ ప్రభాకర్, కొడిమ్యాల తహసీల్దార్ రమేశ్, సీఐ, ఎస్సైలు ఉన్నారు.
మూడు నిమిషాల ఆలస్యం.. పరీక్షకు దూరం
మల్యాల: జేఎన్టీయూ పరీక్ష కేంద్రం తెలియక మూడు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న ఓ విద్యార్థిని పరీక్ష దూరమైంది. మల్లాపూర్ మండలం వీవీ.రావుపేటకు చెందిన సీహెచ్.నవ్యకు జేఎన్టీయూ కేంద్రం పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరింది. ఇంజినీరింగ్ కళాశాల అడ్రస్‌పై అవగాహన లేక దిగువ కొండగట్టు వరకు వెళ్లారు. పూర్తి అడ్రస్ తెలుసుకుని వెళ్లే సరికి మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో అక్కడున్న సిబ్బంది లోపలికి అనుమతించలేదు. గతంలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా.. ఆశించిన ఫలితం రాలేదని, మరోసారి పరీక్షకు సన్నద్ధమైన రాయలేకపోయాయని ఆవేదనతో తిరిగి వెళ్లిపోయింది.

నీట్ పరీక్ష ప్రశాంతం