
‘ఇందిరమ్మ ఇళ్ల’ను వేగవంతం చేయాలి
జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. లబ్ధిదారుల గృహ నిర్మాణ పరిశీలన చేయాలని, నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన, డీపీవో మదన్‌మోహన్, హౌసింగ్ డీఈ ప్రసాద్ పాల్గొన్నారు.
కోర్టులో సదుపాయాలు కల్పిస్తా
జగిత్యాలజోన్: కోర్టుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తానని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు కోర్టుకు వచ్చిన ఆయనకు న్యాయవాదులు స్వాగతం పలికారు. నూతన కోర్టుల ఏర్పాటుతోపాటు న్యాయవాదులు, కక్షిదారులకు సదుపాయాలు కల్పిస్తానన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గోన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ బోధన
సారంగాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉత్తమ బోధన అందుతుందని సంజయ్ అన్నారు. ఇటీవల పదిలో టాపర్‌గా నిలిచిన బీర్‌పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులను శనివారం అభినందించారు. బీర్‌పూర్ హెచ్‌ఎం సంగెనభట్ల నర్సింహ్మమూర్తి, ఉపాధ్యాయులు రఘుపతి, ధరణి, మంజునాథ్, ప్రజుల, గౌతమి, గంగారాం, మంగ, ఉమతో పాటు నాయకులు సుశీన్,హరీష్‌లు ఉన్నారు.