
సీఈఐఆర్‌ను సద్వినియోగం చేసుకోవాలి
జగిత్యాలక్రైం: సీఈఐఆర్ పోర్టల్‌ను సద్విని యోగం చేసుకోవాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చోరీకి గురైన, పడిపోయిన సుమారు రూ.20 లక్షల విలువ గల 102 మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో వినియోగదారులు తమ పోయిన మొబైల్ వివరాలు నమోదు చేసుకుంటే సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐటీకోర్ ఇన్‌స్పెక్టర్ రఫీక్‌ఖాన్, ఆర్‌ఎస్సై కృష్ణ, సీఈఐఆర్ హెడ్‌కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుళ్లు అజర్, మల్లేశ్ పాల్గొన్నారు.
సిటీ పోలీస్‌యాక్ట్ అమలు
శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి 31వరకు జిల్లావ్యాప్తంగా సిటీ పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు నిర్వహించరాదన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు సహకరించాలని కోరారు.