
పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత
జగిత్యాలటౌన్: జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బ్యాగ్‌ను తిరిగి ఆమెకు అప్పగించారు సిబ్బంది. జగిత్యాల డిపోకు చెందిన బస్సులో వరంగల్‌కు చెందిన సులోచన కరీంనగర్‌లో ఎక్కింది. తులం బంగారం, సెల్‌ఫోన్, డబ్బులు ఉన్న బ్యాగ్‌ను బస్సులో మరిచిపోయి దిగిపోయింది. బస్ కండక్టర్ గంగప్రసాద్ ఆ బ్యాగ్‌ను గుర్తించి జగిత్యాల డిపోలో అప్పగించారు. ఇంటికెళ్లిన ప్రయాణికురాలు బ్యాగ్ పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించి టికెట్ ఆధారంగా జగిత్యాల డిపోకు చేరుకుంది. అన్ని ఆధారాలను పరిశీలించిన ఆర్టీసీ సిబ్బంది ఆ బ్యాగును ఆమెకు అందించారు. బ్యాగును అందించిన కండక్టర్ గంగప్రసాద్, సిబ్బందికి సులోచన ధన్యవాదాలు తెలిపారు. డిపో క్లర్క్ మొండయ్య తదితరులు ఉన్నారు.