సమాజంపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

సమాజంపై అవగాహన అవసరం

Mar 21 2025 1:24 AM | Updated on Mar 21 2025 1:21 AM

జగిత్యాల: విద్యార్థులు సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులను గమనించాలని, అవగాహన పెంచుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం ఎస్‌కేఎన్‌ఆర్‌ (ప్రభుత్వ) ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌–2025 రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలను ప్రారంభించారు. కేంద్రప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో వికసిత్‌ భారత్‌కు జగిత్యాలను నోడల్‌ జిల్లాగా ప్రకటించ డం అభినందనీయమన్నారు. విద్యార్థులు వన్‌ నేష న్‌, వన్‌ ఎలక్షన్‌ అంశంపై సృజనాత్మకత అంశాలు జోడించి అభిప్రాయాలు తెలపాలన్నారు. అదనపు కలెక్టర్‌ లత మాట్లాడుతూ ఇన్నోవేషన్‌ ప్రోగ్రాంపై అవగాహన పెంచుకోవాలని, విస్తృతంగా ప్రచారం చేస్తూ సామాజిక అభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ చిరంజీవి, మాజీ చైర్మన్‌ అడువాల జ్యోతి, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు మంచాల కృష్ణ, కళాశాల ప్రిన్సిపల్‌ అశోక్‌, నోడల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, యువజన క్రీడల అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్‌, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మనోహర్‌, ఎన్‌సీసీ అధికారి సాయిమధుకర్‌, శ్రీనివాస్‌, సురేందర్‌, గణపతి, దివ్యరాణి, కవిత పాల్గొన్నారు.

మార్కెట్ల అభివృద్ధికి నిధులు

జగిత్యాలజోన్‌: వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. చల్‌గల్‌ మార్కెట్‌లో చేపడుతున్న పనులను గురువారం పరిశీలించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల చొరవతో చల్‌గల్‌కు రూ.1.70 కోట్లు తీసుకొచ్చానని, గత ప్రభుత్వ హయాంలో రూ.8కోట్లతో లక్ష చదరపు అడుగుల షెడ్లు నిర్మించామని పేర్కొన్నారు. వాలంతరికి పదెకరాల స్థలాన్ని మామిడి మార్కెట్‌కు కేటాయించామన్నారు. నాయకులు గిరి నాగభూషణం, దామోదర్‌ రావు, ఎల్లారెడ్డి, ముకుందం, నారాయణ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, గంగయ్య, మల్లారెడ్డి, సురేందర్‌ రావు, మహేశ్వర్‌ రావు,మార్కెట్‌ కార్యదర్శి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement