నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తికి ఆర్నెళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తికి ఆర్నెళ్ల జైలు

Mar 19 2025 12:56 AM | Updated on Mar 19 2025 12:51 AM

జగిత్యాలజోన్‌: నిర్లక్ష్యంగా వాహనం నడపడమే కాకుండా ఇతరులకు గాయాలు కావడానికి కారణమైన నిందితుడికి ఆర్నెళ్ల జైలు, రూ.9వేల జరిమానా విధిస్తూ జిల్లా రెండో అదనపు జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ వినీల్‌కుమార్‌ మంగళవారం తీర్పు చెప్పారు. గాయపడికి ఇద్దరు బాధితులకు రూ.30వేల చొప్పున పరిహారం అందించాలని కూడా తీర్పులో సూచించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.రజనీ కథనం ప్రకారం.. కొడిమ్యాలకు చెందిన పోతర్ల రవి 2019 మే 15న తన కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై వేములవాడ నుంచి కొడిమ్యాల వస్తున్నాడు. నల్గోండ లక్ష్మినృసింహాస్వామి గుడి వద్ద వేములవాడకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న మ్యాకల అంజయ్య అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడిపి ఎదురుగా వస్తున్న రవిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో రవి, ఆయన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్సై సతీష్‌ కేసు నమోదు చేసుకుని నిందితుడిపై కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్‌ అధికారులు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో మ్యాకల అంజయ్యకు ఆర్నెళ్ల జైలు, రూ.9వేల జరిమానా విధించారు.

విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచాలి

జగిత్యాల: విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సభ్యులు జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పలు మండలాల్లోని పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు మంచి ఫలితాలు ఇవ్వాలన్నారు. ఆయన వెంట జిల్లా కో–ఆర్డినేటర్‌ రాజేశ్‌, డీఈవో రాము ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement