మల్యాల ఎంపీపీగా రవళి | - | Sakshi
Sakshi News home page

మల్యాల ఎంపీపీగా రవళి

May 25 2024 12:45 AM | Updated on May 25 2024 12:45 AM

మల్యాల ఎంపీపీగా రవళి

మల్యాల ఎంపీపీగా రవళి

● నెగ్గిన అవిశ్వాస తీర్మానం

మల్యాల: మల్యాల మండల పరిషత్‌ చైర్‌పర్సన్‌గా మల్యాల ఎంపీటీసీ–1 సభ్యురాలు ఆగతంపు రవళి ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మాజీ ఎంపీపీ మిట్టపల్లి విమలపై గతనెలలో నిర్వహించిన అవిశ్వాస పరీక్ష నెగ్గడంతో వైస్‌ ఎంపీపీ పోతాని రవిని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. నిబంధనల ప్రకారం నూతన ఎంపీపీ నియామకం కోసం ఆర్డీవో నోటీసు జారీ చేసి, శుక్రవారం ఎంపీడీవో స్వాతితో కలిసి ఆర్డీవో మధుసూదన్‌ మల్యాల మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ నియామకం కోసం ఎన్నికలు నిర్వహించారు. మల్యాల మండల పరిషత్‌లో 14మంది ఎంపీటీసీలకు గానూ 8మంది సమావేశానికి హాజరుకాగా, ఎంపీపీగా మల్యాల ఎంపీటీసీ–1 ఆగతంపు రవళి ఒక్కరే నామినేషన్‌ వేశారు. తాటిపల్లి ఎంపీటీసీ దొంగ అనిత రవళిని ఎంపీపీగా ప్రతిపాదించగా, రాంపూర్‌ ఎంపీటీసీ బలపరిచారు. మెజారిటీ సభ్యులు చేతులు ఎత్తడంతో ఆర్డీవో మధుసూదన్‌ రవళిని మల్యాల ఎంపీపీగా ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. అనంతరం ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ఎంపీపీ ఆగంతపు రవళివంశీని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మల్యాల మండల కేంద్రానికి వచ్చి ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement