బోరామీ చేప: బరువు 300 కేజీలు, పొడవేమో 13 అడుగులు! ప్రపంచంలో అతిపెద్దది!!

World Largest Freshwater Fish Found Cambodia Mekong River - Sakshi

ప్రపంచంలోనే అతిపె..ద్ద మంచి నీటి చేపను గుర్తించారు పరిశోధకులు. ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన పెద్ద చేపలతో పోల్చుకుని.. దీనిని నిర్ధారించారు. సుమారు 13 అడుగుల పొడవు, దాదాపు 300 కేజీల బరువు ఉంది అది. 

కంబోడియా మెకాంగ్‌ నదిలో ఈ భారీ చేపను గుర్తించారు. పదలు సంఖ్యలో జాలర్లు దీనిని ఒడ్డుకు లాక్కొరు. ఖేమర్‌ భాషలో క్రిస్టెన్డ్‌ బోరామీ(పూర్తి చంద్రుడు) అని పిలవబడే ఈ చేపకు.. దాని ఆకారం వల్లే ఆ పేరు వచ్చింది. అయితే దొరికిన ఈ భారీ చేపను పరిశీలించిన పరిశోధకులు.. జాలర్లను ఒప్పించి ఎలక్ట్రానిక్‌ ట్యాగ్‌తో తిరిగి నీళ్లలోకి వదిలేశారు. ఇక నుంచి దాని కదలికలను పరిశీలించనున్నారు. 

నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానెల్‌లో ‘మాంస్టర్‌ ఫిష్‌’ షో నిర్వాహకుడు జెబ్‌ హోగన్‌.. దీనిని అధికారికంగా ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి చేపగా గుర్తించారు. ఇంతకుముందు 2005లో థాయ్‌లాండ్‌లో 293 కేజీల బరువున్న ఓ క్యాష్‌ పిష్‌ను పరిశోధకులు గుర్తించారు. 

మెకాంగ్‌ నది ప్రపంచంలోనే చేపల ఆవాసం ఎక్కువగా ఉండే మూడో నది. మితిమీరి చేపలు పట్టడం, కాలుష్యం, ఉప్పునీటి చొరబాటు, అవక్షేపాల క్షీణత కారణంగా చేపల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top