మరో మహమ్మారికి సిద్ధంగా ఉండాలి: డబ్ల్యూహెచ్‌ఓ

WHO Can Beat Coronavirus Must Prepare For Next Pandemic Now - Sakshi

జెనివా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) 73వ వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ వర్చువల్ సెషన్‌లో భాగంగా మూడు ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. సైన్స్‌, సొల్యూషన్స్‌, సోలిడారిటీ అనే మూడు ఆయుధాలతో కరోనాను ఓడించగలమని తెలిపారు. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ ‘కరోనా అనేది  ప్రపంచ సంక్షోభం అయినప్పటికీ, అనేక దేశాలు, నగరాలు సమగ్రమైన, సాక్ష్య-ఆధారిత విధానాలతో వైరస్‌ ప్రసారాన్ని విజయవంతంగా నిరోధించాయి, నియంత్రించాయి. ఇక కోవిడ్విజృంభణ వల్లే మొదటి సారి ప్రపంచం అన్ని దేశాలకు అవసరమైన వ్యాక్సిన్స్‌, డయాగ్నస్టిక్స్, చికిత్సా విధానాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి.. సమాన ప్రాతిపదికన వాటిని అన్ని దేశాలకు అందుబాటులో ఉండేలా చూడడానికి ఒక ప్రణాళికతో ముందుకు కదిలింది. యాక్సెస్‌ టూ కోవిడ్ -19 టూల్స్ (ఏసీటీ) యాక్సిలరేటర్‌  నిజమైన ఫలితాలను అందిస్తోంది ”అని తెలిపింది.

అంతేకాక ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలని డబ్ల్యూహెహ్ఓ పిలుపునిచ్చింది. ఈ విషయంలో వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ కోవిడ్‌-19 వంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల (2005)కు అనుకూలంగా ఓ బలమైన ముసాయిదా తీర్మానాన్ని పరిశీలిస్తుంది అని తెలిపింది. "ఈ తీర్మానం కోవిడ్ -19 వంటి ఇతర ప్రమాదకరమైన అంటు వ్యాధుల కేసులను గుర్తించడానికి, ప్రతిస్పందించడానికి అన్ని దేశాలు మెరుగ్గా ఉన్నాయని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది" అని వెల్లడించింది. క్లిష్టమైన ఆరోగ్య లక్ష్యాలపై దేశాలు వెనక్కి తగ్గకూడదని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. "కోవిడ్ -19 మహమ్మారి వల్ల దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి ఆరోగ్యం అనేది ఎంతటి బలమైన పునాదో తెలిసివచ్చింది" అన్నది. అలానే ‘డబ్ల్యూహెచ్‌ఓ 'ట్రిపుల్ బిలియన్' లక్ష్యాలు ఎందుకు చాలా ముఖ్యమైనవి, దేశాలు వాటిని మరింత ధృనిశ్చయంతో, సహకారంతో ఎందుకు కొనసాగించాలి అనే విషయాలకు కరోనాతో సమాధానం లభించింది’ అని తెలిపింది. (చదవండి: తెలిసింది కొంతే.. తెలియనిది ఇంకెంతో!) ఓ

ఇక కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 47 మిలియన్లకు పైగా కోవిడ్ -19 కేసులు నమోదు కాగా.. 1.2 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇక వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ సమావేశంలో నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల పరిష్కారానికి గాను 10 సంవత్సరాల ప్రణాళిక గురించి చర్చించింది. అలాగే మెనింజైటిస్, మూర్ఛ, ఇతర నాడీ సంబంధిత రుగ్మతలు, తల్లి శిశువు, చిన్నపిల్లల పోషణ, డిజిటల్ ఆరోగ్యంతో పాటు 2010లో స్వీకరించిన డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ కోడ్ ప్రాక్టీస్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ ఆఫ్ హెల్త్ పర్సనల్‌ గురించి కూడా చర్చించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

26-01-2021
Jan 26, 2021, 02:06 IST
అందులో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తోన్న కోవిషీల్డ్, భారత్‌ బయోటెక్‌ తయారుచేస్తోన్న కోవాగ్జిన్‌ సురక్షితమైనవి అజయ్‌ భల్లా...
25-01-2021
Jan 25, 2021, 21:30 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 27,717 మందికి కరోనా పరీక్షలు చేయగా 56 మందికి పాజిటివ్‌ వచ్చింది....
25-01-2021
Jan 25, 2021, 16:40 IST
కోవిడ్‌ మహమ్మారిని తరిమికట్టడంలో ప్రపంచదేశాలతో భారత్‌ పోటీపడుతోంది.
25-01-2021
Jan 25, 2021, 12:47 IST
మెక్సికో: ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా వైరస్‌ నివారణ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తున్నప్పటికీ  కరోనా మహమ్మారి ప్రకంపనలు ఇంకా...
25-01-2021
Jan 25, 2021, 12:36 IST
జగిత్యాల‌: కరోనా మహమ్మారి రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల చొప్పున వ్యాక్సిన్‌...
25-01-2021
Jan 25, 2021, 02:02 IST
కోపెన్‌హాగెన్‌: బ్రిటన్‌లో కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌ యూరప్‌ని ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. 70శాతం వేగంగా కొత్త స్ట్రెయిన్‌ కేసులు వ్యాప్తి...
24-01-2021
Jan 24, 2021, 17:43 IST
ఈ నెల 22న వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆమె మరణించారు. అయితే వ్యాక్సిన్‌ వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు అనుమానాలు వ్యక్తం...
24-01-2021
Jan 24, 2021, 08:43 IST
కోవిడ్‌ కట్టడికి ప్రపంచమంతా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంటే.. అమెరికాకు చెందిన ఎలి లిలీ అనే ఫార్మా కంపెనీ మరో...
24-01-2021
Jan 24, 2021, 04:28 IST
లాస్‌ ఏంజెలిస్‌: అర్ధ శతాబ్దానికి పైగా ప్రపంచ నేతలు, సినీ రంగ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల దాకా ముఖాముఖిలు నిర్వహించి...
23-01-2021
Jan 23, 2021, 21:08 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 43,770 మందికి కరోనా పరీక్షలు చేయగా 158 మందికి పాజిటివ్‌ వచ్చింది....
23-01-2021
Jan 23, 2021, 17:30 IST
హాంకాంగ్ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హాంకాంగ్‌లోని కోలూన్ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధించింది. అక్కడ నివసించే 10వేలమంది నివాసితులు తప్పనిసరిగా...
23-01-2021
Jan 23, 2021, 12:50 IST
కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పంపడంతో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బొల్సనారో భారతదేశంపై ప్రశంసలు కురిపించాడు. రామాయణంలో హనుమంతుడు సంజీవని తీసుకొచ్చి...
23-01-2021
Jan 23, 2021, 11:23 IST
కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌.. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి కిలోమీటర్‌ దూరంలో ఉంది. దీంతో వ్యాక్సిన్ల ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం...
23-01-2021
Jan 23, 2021, 09:57 IST
ఆంక్షలు ఎత్తివేయడం తొందరపాటు చర్యగా భావిస్తోన్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ 
23-01-2021
Jan 23, 2021, 09:55 IST
ఓ మహిళకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 సార్లు కరోనా సోకిందట. పరీక్ష చేసుకున్నా ప్రతిసారి ఆమెకు...
23-01-2021
Jan 23, 2021, 08:34 IST
బ్రెజిల్, మొరాక్కో దేశాలకు సైతం కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ వాణిజ్య ఎగుమతులను భారత్‌ ప్రారంభించింది
23-01-2021
Jan 23, 2021, 06:53 IST
బెంగళూరు జైలులో అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆస్పత్రి పాలైన చిన్నమ్మ కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. ఇంకా పలు అనారోగ్య సమస్యలు...
23-01-2021
Jan 23, 2021, 03:48 IST
లక్నో: కరోనా వ్యాక్సిన్‌కు హడావుడిగా ఇచ్చిన అనుమతులపై రాజకీయాలు చేయడం తగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. రాజకీయ...
22-01-2021
Jan 22, 2021, 14:11 IST
మానసిక సమస్యల కారణంగా పూర్తిస్థాయి ఫలితాలు రాకపోవచ్చునని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు
22-01-2021
Jan 22, 2021, 13:24 IST
చెన్నై: మహమ్మారి కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచంపై ఇంకా తొలగలేదు. కేసుల నమోదు కొనసాగుతుండడంతో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అన్ని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top