Canary Island of La Palma in Spain: స్పెయిన్‌లో అగ్నిపర్వతం విస్పోటనం

Volcano Erupts On Spain Atlantic Ocean Island Of La Palm - Sakshi

స్పెయిన్‌లోని అట్లాంటిక్‌​ మహాసముద్ర ద్వీపంలోని లాప్లామాలో అగ్నిపర్వతం పేలి లావా పైకి ఉప్పొంగుతోంది.  లావా ధారలుగా ప్రవహిస్తూ ఎరుపు రంగు అగ్నికీలల్ని వందల మీటర్ల దూరం వరకు వెదజిమ్మింది. దీంతో ఆకాశమంతా ఎరుపురంగులోకి మారింది. అగ్నిపర్వత శిఖరం నుండి ఎర్రటి లావా ఆకాశంలోకి ఫౌంటెయిన్‌లా ఎగసిపడటంతో ప్రజలు వణికిపోయారు.

(చదవండి: ప్రపంచంలోనే ఖరీదైన పెంపుడు జంతువులు ఇవే)

సెగలు, పొగలు గక్కుతూ లావా వరదై పారింది. ఈ క్రమంలో స్పెయిన్‌ అధికారులు తక్షణమే అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ట్విటర్‌లో  వాతావరణ శాఖ షేర్‌ చేసింది. అలాగే దృశ్యా‍ల్ని చూసిన చాలామంది తమ అనుభవాలను పంచుకుంటూ వీడియోలను పంచుకుంటున్నారు.  ప్రస్తుతం ఈ వీడియోలు  సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

(చదవండి: చైనాలో పడవ బోల్తా.. 10 మంది మృతి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top