భయంకరమైన భారీ పీత!.. గోల్ఫ్‌ స్టిక్‌ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!

Viral Video: Monster Crab Snaps Golf Club In Half - Sakshi

The Crab Can Be Seen Clutching The End Of Golf Club: మనం ఇంతవరకు చాలా రకాల జంతువులు, సరీసృపాలకు సంబంధించిన వీడియోలను చాలనే చూశాం. పైగా అవి చేసే రకరకాల విన్యాసలు చూస్తే భయంకరంగానూ ఆశ్యర్యంగాను అనిపిస్తుంది. అచ్చం అలానే ఇక్కొడక భారీ పీత గోల్ప్‌ స్టిక్‌ని భలే సులభంగా విరిచేసింది.

(చదవండి: 40 రోజుల్లో 700 మైళ్లు.. ప్రీత్‌ చాందీ ఒంటరి సాహసం..!)

అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో స్థానికుడు పాల్ బుహ్నర్ అతని స్నేహితులు గోల్ఫ్‌ క్లబ్‌లో ఒక పెద్ద పీతను చూశారు. ఆ పీత చూడటానికి చాలా పెద్దగా ఉంది. అది గోల్ఫ్‌ స్టిక్‌(ఐరన్‌)ని ఏదో చెకోడిలు విరిచినట్టుగా పటపటమంటు విరిచేస్తుంది. పైగా అలా మూడు గోల్ఫ్‌ స్టిక్‌ల్ని విరిచేస్తుంది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కెర్రీ బుహ్నర్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. పైగా తన భర్త పాల్‌ బుహ్నర్ గోల్ప్‌ సందర్బంగా ఈ వీడియోని చిత్రికరించారు అని  తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: రూ.లక్షకో డ్రైవింగ్‌ స్కూల్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top