
భారత్ - పాక్ యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాలు యుద్ధాన్ని విరమించినంటూ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీనిలో భాగంగా భారత్- పాక్‌లతో రాత్రంతా చర్చలు జరిపినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
‘ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించాము. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాలకు నా అభినందనలు’ అంటూ పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని భారత్ సైతం ధృవీకరించింది.

భారత్–పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇకనైనా ఘర్షణలకు తెరదించాలని భారత్, పాక్‌లకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తన వంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని సూచించారు. భారత్, పాక్ మధ్య శాంతి కోసం తాను చేయగలిగినదంతా చేస్తానని ప్రకటించారు.
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025
Pakistan and India have agreed to a ceasefire with immediate effect. Pakistan has always strived for peace and security in the region, without compromising on its sovereignty and territorial integrity!
— Ishaq Dar (@MIshaqDar50) May 10, 2025