బ్రిటన్‌లో కఠిన ఆంక్షలు

Strict Lockdown Imposed In United Kingdom - Sakshi

కరోనా విస్తృతి నేపథ్యంలో అమలు

లండన్‌: డిసెంబర్‌ 26 నుంచి బ్రిటన్‌లో కఠినతరమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. క్రిస్మస్‌ వేడుకల అనంతరం నూతన కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందన్న హెచ్చరికల నేపథ్యంలో కరోనా కట్టడికోసం ఈ కఠినతరమైన ఆంక్షలు విధించారు. ఈస్ట్, సౌత్‌ ఈస్ట్‌ ఇంగ్లండ్‌లోని దాదాపు 60 లక్షల మంది ప్రజలపై కోవిడ్‌ ఆంక్షలు విధించారు. బ్రిటన్‌లో కరోనా మరణాల సంఖ్య 70,000 దాటాయి.  చదవండి: (కొత్త వైరస్‌: ఆ లక్షణాలు కనిపించడం లేదు)

తాజాగా స్కాట్లాండ్, నార్తర్న్‌ ఐర్లాండ్‌లలో కొత్త కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించడంతో ఈ ఆంక్షలను విధించింది. అత్యవసరం కాని షాపులు, బార్లు, రెస్టారెంట్లను మూసివేశారు. పౌరులు ఇంటికే పరిమితంకావాలి. లండన్‌తో సహా ఇంగ్లాండులోని అనేక ప్రాంతాల్లో క్రిస్మస్‌కి ముందే ఈ ఆంక్షలు అమలులో ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో నార్తర్న్‌ ఐర్లాండ్‌లో శనివారం నుంచి ఆరు వారాల లాక్‌డౌన్‌ ప్రకటించారు. జిమ్‌లు, బ్యూటీ సెలూన్లను మూసివేశారు. బార్లు, రెస్టారెంట్లలోకి అనుమతి లేదు. కేవలం ఆహార పదార్థాలు తీసుకెళ్ళేందుకు మాత్రమే అనుమతిస్తారు. స్కాట్లాండ్‌లో సైతం మూడు వారాలపాటు లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top