విజయవంతమైన స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగం  

Spacex Launched New Batch Of Starlink Satellites - Sakshi

వాషింగ్టన్‌: హైక్వాలిటీ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్‌నెట్‌ను అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తోన్న  ఎలన్‌ మస్క్‌  స్పేస్ ఎక్స్‌ కంపెనీ స్టార్‌లింక్‌ మిషన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్-9 రాకెట్‌తో 60 స్టార్‌లింక్ ఉపగ్రహాల కొత్త బ్యాచ్‌ను నిర్ణీత భూకక్ష్యలోకి ఆదివారం ప్రవేశపెట్టింది. స్పేస్‌ఎక్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 14న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌ కాంప్లెక్స్ 39ఎ(ఎల్‌సి-39ఎ) నుంచి ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో‌ 60 స్టార్‌లింక్ ఉపగ్రహాలను మోసుకెళ్లింది.

2019 మే 24న స్పేస్‌ఎక్స్‌ 'స్టార్‌లింక్‌ మిషన్'‌కు శ్రీకారం చుట్టింది. ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా 60 శాటిలైట్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. జనవరి 21, 2021 నాటికి 1,035 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. ప్రస్తుతం మరో 60 శాటిలైట్లను పంపింది. దశాబ్దకాలంలో దాదాపు 12 వేల శాటిలైట్లను స్పేస్‌లోకి పంపించనుంది.

(చదవండి: ఒక్క రోజులోనే మస్క్‌ సంపద ఎంత పెరిగిందో తెలుసా?)

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top