ఉక్రెయిన్‌-రష్యా వార్‌ : చర్చలపై జెలెన్‌ స్కీ కీలక ప్రకటన

Russia Invades Ukraine Live Updates Telugu: War Continues Day 4 - Sakshi

LIVE UPDATES:

బెలారస్‌లో చర్చలకు రెడీ.. జెలెన్‌ స్కీ ప్రకటన

► అంతకు ముందు యుద్ద ప్రభావం ఉన్న బెలారస్‌లో చర్చలకు అంగీకరించని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తాజాగా మనసు మార్చుకున్నారు. తాజాగా బెలారస్‌లోని గోమెల్‌లో రష్యాతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు జెలెన్‌ స్కీ అంగీకరించారని రష్యా మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. 

ఉక్రెయిన్‌కు సాయం చేస్తాం.. రొమేనియా 

► ఉక్రెయిన్‌కు సరిహద్దు దేశంగా రొమేనియా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు 3.3 మిలియన్ డాలర్ల విలువైన సహాయం అందించనున్నట్టు పేర్కొంది. అంతేకాకుండా చమురు, మంచి నీరు, ఆహరం, మిలిటరీ సామాగ్రి, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లను అందజేస్తామని రొమేనియా ప్రభుత్వ ప్రతినిధి డాన్ కార్బునారు వెల్లడించారు. రష్యా దాడుల్లో గాయపడిన సైనికులకు, పౌరులకు వైద్య సాయం అందిస్తామన్నారు. పిల్లలు, గర్భిణిలు, వృద్ధుల తరలింపు కోసం ప్రత్యేక బస్సులను, అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. 

రష్యా తీరుపై అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉక్రెయిన్‌

► రష్యా సైనిక చర్యల నేపథ్యంలో ఉక్రెయిన్‌ తమకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటోంది. రష్యా తీరుపై ఉక్రెయిన్‌.. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రష్యా సైనిక దాడులను నిలిపివేసే విధంగా రష్యాను ఆదేశించాలని కోరుతూ జెలెన్‌ స్కీ దరఖాస్తు సమర్పించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా తెలుపుతూ వచ్చే వారంలో ఈ దరఖాస్తుపై విచారణ ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.    

వీసా లేకున్నా పోలాండ్‌లోకి ఇండియన్స్‌కి ఎంట్రీ అనుమతి

► ఉక్రెయిన్‌ పరిస్థితుల నుంచి స్వదేశానికి వచ్చే భారతీయుల కోసం పోలాండ్‌ కీలక ప్రకటన చేసింది. భారతీయ విద్యార్థులకు వీసా లేకున్నా పోలాండ్‌లోకి అనుమతిస్తున్నట్టు భారత్‌లో ఆ దేశ రాయబారి ఆడమ్‌ బురాకొవ్‌స్కీ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. 

ఉక్రెయిన్‌లోనే ఉండండి.. చైనీయులకు సూచన

► చైనా తమ దేశ పౌరులను స్వదేశానికి తరలించే ప్రక్రియపై ఉక్రెయిన్‌లోని చైనా రాయ‌బార కార్యాల‌యం స్పందించింది. ప‍్రస్తుతం చైనీయులు ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లే పరిస్థితులు లేవని చైనా రాయబారి ఫ్యాన్‌ జియోన్రాంగ్‌ వెల్లడించారు. రష్యా దాడి ముగిసే వరకు చైనీయులు  సంయమనం పాటించాలని కోరారు. తాను కూడా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోనే ఉన్నానని చైనీయులకు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఉన్న చైనా పౌరులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వీలైనంత త్వరలో చైనీయులను సురక్షితంగా స్వదేశానికి చేరుస్తామని భరోసానిచ్చారు. చైనీయులు సురక్షితంగా ఉండేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 

ఉక్రెయిన్‌ ఆక్రమణలో రష్యా కీలక ముందడుగు
రష్యా సేనల ఆధీనంలో వ్యూహాత్మక నరగం నోవా కఖోవ్‌కా
రష్యన్‌ బలగాలు నోవా కఖోవ్‌కాను స్వాధీనం చేసుకున్నట్లు మేయర్‌ ధ్రువీకరించారు. 

► నాలుగో రోజూ ఉక్రెయిన్‌పై మిస్సైళ్లలో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. రాజధాని నగరం కీవ్‌లోకి ప్రవేశించేందుకు రష్యా సైన్యం యత్నింస్తోంది. ఉక్రెయిన్‌ గ్యాస్‌, చమురు నిక్షేపాలను రాష్యా సేనలు టార్గెట్‌ చేస్తూ దాడులు చేస్తున్నాయి. కార్కివ్‌లోని గ్యాస్‌ పైప్‌లైన్‌ను రష్యా బలగాలు పేల్చేశాయి. శక్తివంచన లేకుండా రష్యా దళాలను ఉక్రెయిన్‌ సైన్యం తిప్పికొడుతోంది.  

పుతిన్‌కు షాకిచ్చిన జూడో ఫెడరేషన్‌
► ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో పుతిన్‌కు అంతర్జాతీయ జూడో ఫెడరేషన్‌ షాకిచ్చింది. ఇంటర్నేషనల్‌ జూడో ఫెడరేషన్‌ అంబాసిడర్‌, జూడో ఫెడరేషన్‌ గౌరవ అధ్యక్ష పదవుల నుంచి పుతిన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు ఐజేఎఫ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. 

చర్చలకు సిద్ధమే.. ప్లేస్‌ అక్కడ కాదు..

► ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ రష్యాతో చర్చలకు తాము కూడా సిద్దంగా ఉన్నామన్నారు. కానీ, చర్చలకు బెలారస్‌ ఆమోదయోగ్యం కాదని.. అక్కడి నుంచే రష్యా దాడులను పాల్పడిందంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో యుద్ద వాతావరణం లేని ప్రాంతంలో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. వార్సా, ఇస్తాంబుల్‌, బాకు ప్రాంతాల్లో ఏ చోట చర్చలు జరిపినా తాను అక్కడికి వచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.

రష్యా ఆర్మీ కాన్వాయ్‌ బ్లాస్ట్‌
► రష్యా సైనిక బలగాలపై ఉక్రెయిన్‌ ఆర్మీ తన పోరాటపటిమను చూపిస్తోంది. కాగా, ఉక్రెయిన్‌ ప్రజలు, పోలీసులు చెర్నిహివ్‌లో రష్యా యుద్ద ట్యాంకర‍్లను అడ్డుకున్నారు. మరోవైపు ఖర్కీవ్‌లో రష్యా ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేసిన ఉక్రెయిన్‌ సైనికులు యుద్ధ వాహనాలను దగ్దం చేశారు.  

తగ్గేదేలే.. బెలారస్‌ చర్చలకు రావడం లేదు.. తెగేసి చెప్పిన ఉక్రెయిన్‌
►రష్యా మీడియా ప్రకారం..సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేయడం కోసం బెలారస్‌లో చర్చలకు రష్యా ఉక్రెయిన్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే చేసిందంతా చేసి ఇప్పడు ఈ మీటింగ్‌ ఏంటని ఉక్రెయిన్‌ అనుకుందేమో గానీ చర్చలకు రావట్లేదని తెగేసి చెప్పింది. కాగా ఇప్పటికే రష్యా అధికారులు చర్చలకోసం బెలారస్‌కు చేరుకున్నారు. తాజా ఉక్రెయిన్‌ నిర్ణయంతో ఈ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో. 

ఉక్రేనియన్లతో చర్చల కోసం బెలారస్‌కు చేరుకున్న రష్యన్లు

►రష్యా ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ఆపేందుకు.. ఉక్రేనియన్లతో చర్చించి ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు రష్యన్లు బెలారస్‌కు చేరుకున్నారని స్థానిక మీడియా తెలిపింది. కాగా ఉక్రెయిన్లతో సమావేశమై సమస్యకు పరిష్కారం చూపేందుకు తాము సిద్ధమని రష్యా ఇది వరకే ప్రకటించింది.

ఉక్రెయిన్ సైనికులను అదుపులోకి తీసుకున్న రష్యా 
►నివేదికల ప్రకారం.. 471 మంది ఉక్రెయిన్ సైనికులను అదుపులోకి తీసుకున్నట్లు రష్యా సైన్యం తీసుకున్నట్లు సమాచారం.

నాటో భాగస్వాముల ద్వారా ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపుతున్న ఆస్ట్రేలియా
►తాము ఒంటరిని ఆవేదన వ్యక్తం చేసిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి కాస్త ఊరట లభించనుంది. ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా ఉక్రెయిన్‌కు తమ  వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో ఐరోపాలోని నాటో మిత్రదేశాల ద్వారా ఆస్ట్రేలియా ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయనుంది. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ తెలిపారు.

స్విట్జర్లాండ్‌లో వెల్లువెత్తుతున్ననిరసనలు
►ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న మారణ హోమానికి బదులుగా రష్యా పై ఆంక్షలు  విధించాలని స్విట్జర్లాండ్‌ ప్రజలు తమ నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 20వేల మంది రోడ్ల పైకి వచ్చి నిరసన తెలిపారు. కాగా ఇప్పటికే పలు దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపుతూ రష్యాపై ఆంక్షలు విధించాయి.

తప్పెవరిదైనా మారింది కీవ్‌ నగరం.. శ్మశాన నిశ్శబ్దం
►ఉక్రెయిన్‌ పై రష్యా మిలటరీ ఆపరేషన్‌ ప్రకటించిన యుద్ధం నాలుగో రోజు కొనసాగుతోంది. రష్యన్‌ బలగాల అధునాతన ఆయుధాల ధాటికి రాజధాని కీవ్‌ నగరంలో శ్మశాన నిశ్శబ్దం కనిపిస్తోంది.

భయానక వాతావరణం, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొనడంతో ఆ ప్రాంత ప్రజలు దాదాపు ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోయారు. దీనికి తోడు మూడు రోజులుగా నగరంలో మిస్సైల్ ఎటాక్స్, కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో నగరం కాస్త నరక మార్గంలా మారింది.

ఉక్రెయిన్‌లోని నోవా కఖోవ్కాలోని డ్నీపర్ నదిపై ఉన్న కఖోవ్కా జలవిద్యుత్ ప్లాంట్ సమీపంలో ఉన్న రష్యన్‌ బలగాల శాటిలైట్‌ చిత్రాలు

యుద్ధ విమానాలలో సౌండ్‌తో కీవ్‌ నగరంలో రీసౌండ్‌..
► యాక్షన్‌ సినిమా తరహాలో యుద్ధ విమానాలు, బాంబుల మోతలు, బుల్లెట్ల సాండ్‌లతో కీవ్‌ నగరం దద్దరిల్లుతోంది. 

‘ఉక్రెయిన్‌ ఒంటరి కాదు.. మేమున్నాం’
► రష్యన్‌ బలగాలు రాజధానిలో బాంబుల మోత మోగిస్తోంది. రష్యా అనుసరిస్తున్న తీరుపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు రష్యాపై ఆంక్షలు కూడా విధించాయి. తాము ఒంటరిగా పోరాడుతున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ప్రపంచ దేశాల సహాయం కోరిన సంగతి తెలిసిందే. అందుకు స్పందనగా సుమారు 25 దేశాలు వారి మద్దతుతో పాటు ఉక్రెయిన్‌కు కావాల్సిన వైద్య, ఆర్థిక, సహకారాలను అందిస్తామని ముందుకొచ్చాయి. కొన్ని దేశాలు తమ మిలటరీ బలగాలను ఉ‍క్రెయిన్‌కు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. 

ఎందుకీ మారణహోమం..
►ఉక్రెయిన్‌పై రష్యా ప్రకటించిన యుద్ధం నాలుగో రోజుకు చేరుకుంది. మొదట్లో కాస్త నెమ్మదిగా వ్యవహరించిన ఉక్రెయిన్‌ శనివారం నుంచి దూకుడు పెంచింది. ఈ క్రమంలో ఓ రష్యన్‌ యద్ధ విమానం మంటలు మండుతూ కుప్పకూలింది.

ఢిల్లీకి చేరుకున్న మూడో విమానం
►బుకారెస్ట్‌ నుంచి 240 మంది భారతీయ విద్యార్థులతో మూడో విమానం ఢిల్లీ చేరుకుంది. ఆదివారం ఇప్పటికే రెండు విమానాలను నుంచి సుమారు 500 మంది విద్యార్థులు బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.

గాలిలో ఉన్న వదలా నిన్ను..
►తామ ప్రత్యర్థి అన్ని రకాలుగా బలవంతుడని తెలిసిన బెదరక ఎదురు నిలబడి పోరాడుతోంది ఉక్రెయిన్‌ సైన్యం. ఓ సైనికుడు తన కనుచూపు మేరలో రష్యా యుద్ధ విమానం కనపడే సరికి నేల నుంచి రాకెట్లతో దాడి చేస్తున్నాడు.

ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్‌ సేవలను తిరిగి ప్రారంభించిన ఎలోన్‌ మస్క్‌ 
►ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌ స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఉక్రెయిన్‌లో యాక్టివేట్ చేశారు. కీవ్‌ అధికారి ఆ ప్రాంతంలో తిరిగి ఇంటర్నెట్‌ సేవలను తిరిగి అందించాలని కోరారు. దీనికి స్పందనగా మస్క్‌ స్టార్‌లింక్ సేవలను ఉక్రెయిన్‌లో యాక్టివ్‌ అని చేసి ఆ విషయాన్ని ట్వీట్ చేశారు.

ఉక్రెయిన్‌ యుద్ధ విమానాలను ధ్వంసం చేసిన రష్యా
►కీవ్ నగరాన్ని స్వాధీన పరుచుకోవడంలో భాగంగా రష్యన్‌ బలగాలు ఉక్రెయిన్‌ మిలటరీ విమానాలను ధ్వంసం చేశాయి. ఎదురుదాడికి అవకాశం ఇ‍వ్వకుండా రష్యా మిలటరీ ముందుకు ఉక్రెయిన్‌ ఆయుధాలను, వారి స్థావరాలను నాశనం చేయడం మొదలుపెట్టాయి.

ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆయుధాలు పంపుతామన్న జర్మనీ

►దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో రష్యా దళాలు గ్యాస్ పైప్‌లైన్‌ను పేల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది.

► రష్యన్‌ దళాలు ఉక్రెయిన్‌పై దాడులను వేగవంతం చేసింది. రష్యా ఆయుధాలు ఉక్రెయిన్‌ దేశంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. యుద్ధం ఆపకుంటే రష్యాపై ఆంక్షలు విధిస్తామని  ప్రపంచ దేశాలు హెచ్చరించినప్పటికీ పుతిన్‌ తన ప్రణాళిక ప్రకారం ఆపరేషన్‌ని కొనసాగిస్తున్నారు. మరో వైపు ఉక్రెయిన్‌ కూడా రష్యాపై ఎదురు దాడికి దిగింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top