ప్రముఖ సైకాలజిస్ట్‌ డేనియల్‌ కానమన్‌ కన్నుమూత  | Psychologist and Nobel Laureate Daniel Kahneman Dies | Sakshi
Sakshi News home page

ప్రముఖ సైకాలజిస్ట్‌ డేనియల్‌ కానమన్‌ కన్నుమూత 

Mar 29 2024 3:31 AM | Updated on Mar 29 2024 5:27 AM

Psychologist and Nobel Laureate Daniel Kahneman Dies - Sakshi

న్యూజెర్సీ: ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత డేనియల్‌  కానమన్‌ (90) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ప్రకటించింది. 1993వ సంవత్సరం నుంచి  కానమన్‌ అక్కడే పనిచేస్తున్నారు. ఆర్థిక శాస్త్రం చదవకపోయినా ప్రవర్తనా ఆర్థికశాస్త్రానికి ఆయన పర్యాయపదంగా మారారు.

ఆయన రాసిన పుస్తకం ‘థింకింగ్, ఫాస్ట్‌ అండ్‌ స్లో’ ఎంతో ప్రజాదరణ పొందింది. డేనియల్‌ కానమన్‌ సిద్ధాంతాలు సామాజికశాస్త్రాలను చాలా మటుకు మార్చివేశాయని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎల్డార్‌ షాఫిర్‌ పేర్కొన్నారు. 1934లో ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌లో కానమన్‌ జన్మించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement