
వాషింగ్టన్: సోషల్‌మీడియాలో ఏ వార్త ఎప్పుడు ట్రెండ్ అవుతుందో ఎవరికీ తెలీదు. కొన్ని సార్లు అనుకోకుండా జరిగని సంఘటనలు కూడా విపరీతంగా వైరల్ అవుతాయి. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి, ఆ దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు మధ్య జరిగిన ఓ చిన్న సంభాషణ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
జిల్ బైడెన్ ఓ ప్రసంగంలో అమెరికా సైనికులను ఉద్దేశిస్తూ మాట్లాడుతుండగా సరిగ్గా ఆ సమయంలో ఆమెకు బైడెన్ వల్ల చిన్న అంతరాయం ఏర్పడింది. జిల్ మాట్లాడుతున్న సమయంలో ఆమె వెనుక నిల్చున్న బైడెన్ అక్కడ వెనకాలే కూర్చున్న సైనికులతో ఏదో మాట్లాడటం ప్రారంభించారు. దీంతో ఆమె ప్రసంగాన్ని వింటున్న శ్రోతల చూపు బైడెన్ పైకి మళ్లగా దాంతో ఆమె వెంటనే వెనుక తిరిగి చూసి.. బైడెన్‌ను 'జో, పే అటెంక‌్షన్ ( శ్రద్ధ వహించండి)' అని అన్నారు. అంతే.. ఆమె చెప్పిన ఆ మాటతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వేశారు. బైడెన్ కూడా జిల్‌కు అలాగేనంటూ సెల్యూట్ చేసి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి హల్‌చల్ చేస్తోంది.
Jill Biden tells husband to 'pay attention' during speech to US soldiers pic.twitter.com/WYS53U4F6j
— The Independent (@Independent) June 10, 2021