Guinness World Records Day 2021: ఈ విషయాలు మీకు తెలుసా?

Guinness World Records Day 2021: Sakshi special story

సాక్షి, హైదరాబాద్‌:  22 నిమిషాలు పాటు  ఊపిరి బిగబట్టిన స్టిగ్ సెవెరిన్‌సెన్ గురించి మీకు తెలుసా? తమలపాకుల్లాంటి తన చేతులతో విస్తరాకు మడిచినట్టు ఇనుప పెనాన్ని మడత పెట్టేసిన వైనాన్ని మీరెపుడైనా చూశారా. ఒక్క నిముషంలో 10కి పైగా యాపిల్స్‌ను  గిన్సిస్‌ రికార్డు సృష్టించిన భామ గురించి మీకు తెలుసా? అవును ఇవన్నీ ప్రపంచ రికార్డులే. ఇలాంటి క్రేజీ విషయాలతోపాటు,  ఎన్నో ఆసక్తికర విషయాలను రికార్డు చేసేదే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్.  

ప్రపంచంలో ఇంతకముందెవ్వరూ  చేయని  అత్యుత్తమ పనికి, లేదా సాహసానికి  లభించే గుర్తింపే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌. ఇలాంటి అరుదైన రికార్డ్‌ సాధించాలని చాలా మంది డ్రీమ్‌ అయితే  దీనికి కూడా ఒక రోజుంది తెలుసా.  ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది నవంబర్ 17న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే జరుపుకుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి అరుదైన సంఘటనలను, సన్నివేశాలను ఇది రికార్డు  చేస్తుంది.  ఇ లాంటి రికార్డులన్నీ  "గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్" లేదా  జీ డబ్ల్యు ఆర్‌  అనే బుక్‌లో  నిక్షిప్తం చేస్తారు. ఈ బుక్‌  100కి పైగా దేశాల్లో, 23 భాషలలో ప్రచురితమవుతుంది.  మొదటిసారిగా నవంబర్ 19, 2004న జరుపుకోగా ఆ తరువాత నవంరు17కి మారింది  ప్రపంచ రికార్డులను  తెలుసుకోవడంతో పాటు, ఇప్పటికే ఉన్న ఆ రికార్డులను బ్రేక్‌ చేయాలనుకుంటున్న  ఔత్సాహికులను ప్రోత్సహించేలా ఈ దినోత్సవాన్ని ఏటా  జరుపుకుంటారు. (లాంగెస్ట్‌ కిస్‌.. గురక వీరుడు ఇంట్రస్టింగ్‌ వరల్డ్‌ రికార్డులు )

నవంబర్ 10, 1951న, గిన్నిస్ బ్రూవరీస్ మేనేజింగ్ డైరెక్టర్, సర్ హ్యూ బీవర్, ఐర్లాండ్‌లోని షూటింగ్ పార్టీలో యూరప్‌లో అత్యంత వేగవంతమైన  పక్షి  ఏదబ్బా అని ఆలోచన మెదడును తొలిచేసింది. దీనికి సంబంధించి తెలుసుకునేందుకు ఎలాంటి పుస్తకం అందుబాటులో లేదని గుర్తించాడు.  ప్రపంచవ్యాప్తంగా సాధించిన రికార్డులను తెలుసుకునేందుకు ఒక పుస్తకం అవసరమని కూడా అతను గ్రహించాడు. ఈ ఆలోచన క్రిస్టోఫర్ చాటవే అనే ఆయన్ని కూడా ఆకర్షించింది. చాటవే సిఫారసు మేరకు ఆగష్టు 1954లో, నోరిస్ ,అతని రాస్ మెక్‌విర్టర్‌  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను  సంకలనం చేసేందుకు నియమితులయ్యారు. 198 పేజీలతో 1000 కాపీల మొదటి ఎడిషన్‌ ఆగస్టు 27, 1955న  మార్కెట్‌లోకి వచ్చింది.  (ఈ సమంత టాలెంట్‌ తెలిస్తే...‘నోరెళ్ల’ బెడతారు)

బ్రిటన్‌లో  రికార్డు అమ్మకాలను సాధించింది. 1956లో అమెరికాలో  ముద్రితమై 70,000 కాపీలు అమ్ముడయ్యాయి. ఆ తరువాత 1976లో  అమెరికాలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లో ఈ అద్భుతమైన  జి.డబ్ల్యూ.ఆర్. రికార్డులను ప్రదర్శించేందుకు వీలుగా  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మ్యూజియాన్ని ప్రారంభించారు. 

డాగ్‌ అతిపొడవైన నాలుక


30 సెకన్లలో రికార్డు సిట్ డౌన్ ఫుట్‌బాల్ క్రాస్‌ఓవర్‌లు

30వేలకుపైగా పాటలుపాడిన గాన గంధర్వుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం,  అతితక్కువ కాలములో 750 సినిమాలకి పైగా సినిమాలలో నటించిన  హాస్య నటుడు బ్రహ్మానందం, ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు విజయనిర్మల గిన్నీస్ ప్రపంచ రికార్డులు  సాధించిన గొప్పవారిలో నిలిచిన  సినీ ప్రముఖులు. అలాగే 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు అత్యున్నత పర్వతాలను అధిరోహించిన పర్వతారోహకుడు దివంగత మల్లి మస్తాన్‌బాబు కూడా నిలవడం విశేషం.


అతిపొడవైన మీసం

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రపంచ రికార్డులను ఇది నమోదు చేస్తుంది. ఇందులో మానవులు సాధించిన ఘనవిజయాలు మాత్రమే కాదు  ప్రకృతిలో జరిగే విపరీతాలను ఇది పరగణనలోకి తీసుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాలి అనే మీ కల సాకారం కోసం ఈ రోజునుంచే ప్రయత్నాలు మొదలు పెట్టండి.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top