Guinness World Record: Man, Who Married Over A 100 Times In His Lifetime - Sakshi
Sakshi News home page

100 పెళ్లిళ్లు.. 14 దేశాలకు అల్లుడు.. మరో ఆశ్చర్యకరమైన ట్విస్ట్‌ ఏంటంటే?

Apr 8 2023 4:18 PM | Updated on Apr 8 2023 4:57 PM

Guinness World Record: Man Who Married Over A 100 Times In His Lifetime - Sakshi

పెళ్లంటే ఆషామాషీ కాదు.. ఇద్దరు మనుషులు ఒక్కటే నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సి ఉంటుంది. అందుకే వివాహాల విషయంలో పెద్దలు ముందు వెనుక ఆలోచించి అడుగులు వేస్తుంటారు. ఈ రోజుల్లో యువకులు ఒక్క పెళ్లి చేసుకోవడానికి నానాతంటాలు పడుతుంటే.. ఓ వ్యక్తి ఏకంగా వందకుపైగా పెళ్లిళ్లు చేసుకుని ఔరా అనిపించాడు.  ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతను తన భార్యలలో ఒకరికి కూడా విడాకులు ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

వివరాల్లోకి వెళితే.. ఈ వ్యక్తి పేరు గియోవన్నీ విగ్లియోటో. అతను ఏప్రిల్ 3, 1929 న సిసిలీలోని సిరాకుసాలో జన్మించాడు. విచారణ సమయంలో, అతను తన అసలు పేరు నికోయ్ పెరుస్కో అని వెల్లడించాడు. అతని నిజమైన గుర్తింపు ఫ్రెడ్ జిప్ అని కూడా పేర్కొన్నాడు. అతను 1949 1981 మధ్య 105 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అతను భార్యలకు ఒకరి గురించి మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడేవాడు. ఈ పరంపరలో అమెరికాలోని రాష్ట్రాలతో పాటు 14 ఇతర దేశాలలోని యువతులను పెళ్లి చేసుకున్నాడు. ప్రతిసారీ ఫేక్‌ పత్రాలతో నకిలీ పేర్లతో యువతులతో పరిచయం పెంచుకునేవాడు.

కొన్ని రోజుల తర్వాత వారికి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకునే వాడు. పెళ్లైన అనంతరం తాను చాలా దూరంలో జాబ్ చేస్తున్నాని.. ఉద్యోగ నిమిత్తం తప్పినిసరి వెళ్లాలి అంటూ భార్యకు చెందిన విలువైన వస్తువులు, ఆభరణాలు, డబ్బు తీసుకుని పరారయ్యేవాడు.. ఇదే ట్రెండ్‌ను జరిగినంత కాలం కొనసాగించాడు. చివరికి విగ్లియోట్టో డిసెంబర్ 28, 1981న పోలీసుల చేతికి చిక్కాడు. న్యాయస్థానం అతనికి మొత్తం 34 ఏళ్ల జైలు శిక్షతో పాటు 336,000 డాలర్ల జరిమానా కూడా విధించింది. ఎన్నో పెళ్లిళ్లు చేసుకుని, ఎంతో మంది అమ్మాయిలను మోసం చేసిన అతను 1991 లో 61 సంవత్సరాల వయస్సులో మెదడు రక్తస్రావంతో మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement