మరణమృదంగం.. చలికాలంలో మూడు కరోనా వేవ్‌లు?

Corona cases have increased in China and deaths increasing rapidly - Sakshi

కిలోమీటర్ల కొద్దీ రోగుల లైన్లు 

3 నెలల్లో 60% మందికి సోకవచ్చు 

ఆందోళన కలిగిస్తున్న అంచనాలు 

చైనాలో కోవిడ్‌–19 విశ్వరూపం చూపిస్తోంది. ప్రజా నిరసనలకు తలొగ్గి ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానాన్ని వెనక్కి తీసుకున్న దగ్గర్నుంచి కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఆస్పత్రులు కిటకిటలాడిపోతున్నాయి. మందులు దొరకడం లేదు. కరోనా రోగులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని చికిత్స కోసం ఆస్పత్రుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిల్చొంటున్నారు. కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది.

ఆస్పత్రుల కారిడార్లలో, మార్చురీలలో శవాలు వరసగా పెట్టి ఉన్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ అవుతున్నాయి. శ్మశాన వాటికల్లో రోజూ వందలాది మృతదేహాలు వస్తున్నాయి. రోజుకి దాదాపుగా 40 వేల మందికి కరోనా సోకుతున్నట్టుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పైగా చలికాలం ముగిసేలోగా కనీసం మూడు వేవ్‌లు దేశాన్ని అతలాకుతలం చేస్తాయంటూ వెలువడుతున్న అంచనాలు ఆందోళనను మరింత పెంచుతున్నాయి.

ఇంతటి ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ చైనా ప్రభుత్వం మాత్రం కేసుల సంఖ్యని తక్కువ చేసి చూపిస్తోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నా మంగళవారం కేవలం ఐదుగురే ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటించింది. కోవిడ్‌తో శ్వాసకోశ సమస్యలతో చనిపోతేనే కరోనా మరణాలుగా లెక్కిస్తామని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఒమిక్రాన్‌లో త్వరితంగా వ్యాప్తి చెందే బిఏ.5.2, బిఎఫ్‌.7 సబ్‌ వేరియంట్లు విస్తరిస్తున్నాయి. రోగుల తాకిడిని ఎదుర్కోవడానికి బీజింగ్, షాంఘై, చెంగ్డు, వెన్‌ఝూ సహా పలు నగరాల్లో వందల పడకలున్న తాత్కాలిక ఆస్పత్రులు, వందలాది ఫీవర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వైద్య సిబ్బంది ఎక్కువ గంటలు పని చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. 

రాబోయేవి గడ్డు రోజులు  
చైనాలో ఇక మీద గడ్డు రోజులు ఎదుర్కోబోతోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాబోయే మూడు నెలల్లో చైనా జనాభాలో 60శాతానికి పైగా కరోనా బారిన పడతారని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని అంతర్జాతీయ వ్యాధి నిపుణుడు ఎరిక్‌ ఫీగల్‌ డింగ్‌ అంచనా వేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని వచ్చే ఏడాది చైనాలో రోజుకి లక్ష కేసులు నమోదవుతాయని, 20 లక్షల మంది మరణిస్తారని పలు నివేదికలు హెచ్చరించాయి.

వృద్ధుల్లో వ్యాక్సిన్‌ ఇవ్వడంలో చూపించిన నిర్లక్ష్యానికి చైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని నిపుణులు అంటున్నాయి. కరోనాలో అత్యంత కీలకమైన ఆర్‌ వాల్యూ (ఒక వ్యక్తి నుంచి వైరస్‌ ఎంతమందికి సంక్రమిస్తుందో చెప్పే విధానం) 16గా ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అంటే ఒక వ్యక్తి ద్వారా వైరస్‌ 16 మందికి సోకుతుందన్న మాట.

2019లో వూహాన్‌లో కరోనా బట్టబయలయ్యాక ఇంతటి ఘోరమైన పరిస్థితులు నెలకొనడం ఇదే తొలిసారి. జిన్‌పింగ్‌ ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో కరోనాతో ఈ మూడేళ్లలో 3.80 లక్షల కేసులు నమోదైతే, 5,242 మంది ప్రాణాలు కోల్పోయారు. వరల్డ్‌ డేటా మాత్రం ఇప్పటివరకు 20 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని,  గత 24 గంటల్లో 40వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చెబుతోంది.  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

ఆర్థికంగా కుదేల్‌.. 
కరోనా ప్రభావం చైనాను ఆర్థికంగానూ దెబ్బ తీసేలా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 3% వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనాలున్నాయి. గత 50 ఏళ్ల కాలంలో చైనా ఆర్థిక వ్యవస్థ పనితీరు ఈ ఏడాదే అధ్వాన్నంగా మారింది. పనిచేసేవారంతా కరోనా వైరస్‌తో పడకెక్కడంతో అన్ని రంగాల ఉత్పత్తి దారుణంగా పడి పోయింది. జనవరి 2013 తర్వాత ఇప్పుడు డిసెంబర్‌లో చైనాలో అతి తక్కువ వాణిజ్య కార్యకలాపాలు నమోదయ్యాయి. చైనా ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమై ఆ దేశంలో వాణిజ్యం సక్రమంగా సాగకపోతే దాని ప్రభావం ప్రపంచదేశాలపై పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

ఎందుకీ పరిస్థితి?  
► చైనా ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానంతో కఠినమైన నిబంధనలు విధించి లక్షణాలు లేని వారిని క్వారంటైన్‌ చేయడం, మూకుమ్మడి పరీక్షలు, రోగులతో కాంటాక్టయిన వారిని నాలుగ్గోడల మధ్య ఉంచడం వంటివి చేయడంతో ఇన్నాళ్లూ కేసులు వెలుగులోకి రాలేదు. నెలల తరబడి లాక్‌డౌన్‌లు, గదుల్లో తాళాలు వేసే కఠినమైన క్వారంటైన్‌ నిబంధనలపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో జీరో కోవిడ్‌ విధానాన్ని ప్రభుత్వం ఈ నెల 7న వెనక్కి తీసుకుంది. 

చైనాలో ఓ ఆస్పత్రి మార్చురీలో శవాలు 

► ఇన్నాళ్లూ కరోనా వైరస్‌ ఎక్కువ మందికి సోకకపోవడంతో వైరస్‌ను ఎదుర్కొనే సహజసిద్ధమైన ఇమ్యూనిటీ చైనాలో చాలామందికి రాలేదు. ఆంక్షలు పూర్తిగా ఎత్తేయడంతో ఒక్కసారిగా కేసులు భారీగా పెరిగిపోయాయి. 

► చైనా తాను సొంతంగా తయారు చేసిన సినోవాక్, సోనిఫార్మ్‌ వ్యాక్సిన్లనే వాడింది. 350 కోట్ల డోసుల్ని పంపిణీ చేసింది. వీటి సామర్థ్యంపై సవాలక్ష సందేహాలున్నాయి. పైగా 80 ఏళ్ల పైబడిన వారు వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. ఇప్పుడు వాళ్లే వైరస్‌ క్యారియర్లుగా మారారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

► కరోనా వైరస్‌ మానవ నిర్మితమేనని పలు నివేదికలు నిర్ధారించడంతో దీని వ్యాప్తి ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పుడు చైనాలో మరో వేవ్‌ మొదలైందని, దీని వల్ల పలు కొత్త వేరియెంట్‌లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని సింగపూర్‌ యూనివర్సిటీలో వైస్‌ డీన్‌ అలెక్స్‌ కుక్‌ అంచనా వేస్తున్నారు. చైనాలో పరిస్థితి ఇతర దేశాలకు ప్రమాదకరమేనని ఆయన హెచ్చరించారు.   

కేంద్రం అప్రమత్తం  
వైరస్‌ నమూనాలు జన్యు విశ్లేషణకు పంపండి
రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ

న్యూఢిల్లీ: చైనా, జపాన్, దక్షిణకొరియా, బ్రెజిల్, అమెరికా సహా  ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా కొత్త వేరియెంట్లను వెనువెంటనే గుర్తించడం కోసం వైరస్‌ నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపించాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మంగళవారం లేఖ రాశారు.

కరోనాను ఎదుర్కోవాలంటే కొత్త వేరియెంట్లను సకాలంలో గుర్తించాలని, అందుకే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వైరస్‌ నమూనాలను ప్రతీ రోజూ తప్పనిసరిగా జన్యుక్రమ విశ్లేషణ పరీక్షల కోసం పంపించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్‌లో వారానికి 1200  కేసులు వస్తూ ఉంటే, ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల కేసులు వస్తున్నాయని వెల్లడించారు. కొత్త వేరియెంట్లను గుర్తించి  ఎదుర్కోవడానికి ఐదంచెల వ్యూహం అమలుపై దృష్టి పెట్టాలన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్‌ విధానంతో పాటు వ్యాక్సిన్,  నిబంధనల్ని తప్పనిసరిగా పాటించడం  చేయాలన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-08-2023
Aug 11, 2023, 10:12 IST
కరోనా వైరస్‌.. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరి గుండెలో గుబులు పడుతుంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గజగజ వణికించింది....
13-06-2023
Jun 13, 2023, 05:33 IST
న్యూఢిల్లీ:  కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం తీసుకొచ్చిన కోవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ అయిన టీకా లబ్ధిదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తలను...
27-05-2023
May 27, 2023, 05:51 IST
వాషింగ్టన్‌: ఒమిక్రాన్‌ వేరియెంట్‌ తర్వాత కరోనా బాధితుల్లోని ప్రతీ 10 మందిలో ఒకరికి లాంగ్‌ కోవిడ్‌ బయటపడుతోందని అమెరికా అధ్యయనంలో...
15-04-2023
Apr 15, 2023, 05:40 IST
లండన్‌: కోవిడ్‌–19.. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిన మహమ్మారి. లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. నియంత్రణ చర్యలతోపాటు ఔషధాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా...
13-04-2023
Apr 13, 2023, 06:19 IST
న్యూఢిల్లీ: తగిన డిమాండ్‌ లేకపోవడం, కోవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గతంలో ఆగిన కోవిషీల్డ్‌ కోవిడ్‌ టీకా ఉత్పత్తిని తాజాగా...
09-04-2023
Apr 09, 2023, 04:19 IST
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల వ్యవధిలో మరో 6,155 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా, యాక్టివ్‌ కేసులు 31,194కు చేరినట్లు...
08-04-2023
Apr 08, 2023, 04:44 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి మళ్లీ వేగంగా పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ...
03-04-2023
Apr 03, 2023, 06:01 IST
న్యూఢిల్లీ:  దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 3,824 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత ఆరు...
28-03-2023
Mar 28, 2023, 06:06 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,805 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం సోమవారం...
26-03-2023
Mar 26, 2023, 03:09 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభు­త్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల...
20-03-2023
Mar 20, 2023, 05:21 IST
గువాహటి: కరోనా మహమ్మారి మన భావోద్వేగాలతో ఒక ఆటాడుకుంది. మన ఆనందాలను ఆవిరి చేసేసింది. కోవిడ్‌ సోకిన భారతీయుల్లో 35...
19-03-2023
Mar 19, 2023, 04:06 IST
ఐరాస/జెనీవా: 2020లో వూహాన్‌ మార్కెట్‌లో సేకరించిన శాంపిళ్ల డేటాను చైనా తొక్కిపెడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆరోపించింది. కరోనా...
18-03-2023
Mar 18, 2023, 04:25 IST
కరోనా వైరస్‌ పుట్టుకపై ఇది మరో కొత్త విశ్లేషణ. ఇన్నాళ్లూ గబ్బిలాల నుంచి ఈ వైరస్‌ సంక్రమించిందని భావిస్తూ ఉంటే...
04-03-2023
Mar 04, 2023, 14:06 IST
కోవిడ్‌ వ్యాక్సిన్‌ 'స్పుత్నిక్‌ వీ'ని రూపొందించడంలో సహకరించిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఆండ్రీ బోటికోవ్‌ ఒకరు.
22-01-2023
Jan 22, 2023, 06:21 IST
చైనాలోని ఊహాన్‌లో వెలుగు చూసిన నాటి నుంచీ కరోనాకు చెందిన అనేక వేరియెంట్లు... విడతలు విడతలుగా, తడవలు తడవలుగా వేవ్‌లంటూ...
14-01-2023
Jan 14, 2023, 05:03 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే కొత్త రకం అణువులను అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ ఇంజనీర్లు అభివృద్ధి...
14-01-2023
Jan 14, 2023, 04:56 IST
బీజింగ్‌: చైనాలో ఈ నెల 11వ తేదీ నాటికి అక్షరాలా 90 కోట్ల మంది కోవిడ్‌–19 వైరస్‌ బారినపడ్డారు. పెకింగ్‌...
11-01-2023
Jan 11, 2023, 18:10 IST
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం ఇతర దేశాలపై ఏ మేరకు ఉంటుంది? ప్రతి దేశాన్ని కలవరపరుస్తున్న సమస్య. ఏ...
08-01-2023
Jan 08, 2023, 09:48 IST
గుంటూరు మెడికల్‌ : అమెరికా నుంచి గుంటూరు వచ్చిన దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సుమారు పదిరోజుల కిందట ముత్యాలరెడ్డినగర్‌కు...
08-01-2023
Jan 08, 2023, 05:58 IST
షాంఘై: చైనాలో ఒక వైపు భారీగా కరోనా కేసులు నమోదవుతుండగా ‘చున్‌ యున్‌’లూనార్‌ కొత్త సంవత్సరం వచ్చిపడింది. శనివారం నుంచి... 

Read also in:
Back to Top