వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్‌ చేసేందుకు...మరీ అలా చేయాలా?

CCTV Footage shows Man Tries Dog Planting Faeces On Tram Seat Viral - Sakshi

CCTV Footage shows Man Tries Dog Planting Faece: కొంతమంది కొందర్ని కించపరిచే ఉద్దేశంతోనో లేక శాడిజంతోనే తెలియదు గానీ కొన్ని భయంకరమైన పనులు చేస్తారు. పైగా వాటిని చూస్తే చాలా జుగుప్సకరంగా కూడా అనిపిస్తుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎంత చెండాలమైన పనిచేశాడో చూడండి.

(చదవండి: వామ్మో!! ఆరు టన్నుల లాంతర్‌ ఆవిష్కరణ!!)

అసలు విషయంలోకెళ్లితే....టర్కీలోని ఒక వ్యక్తి ఇస్తాంబుల్‌​ వెళ్లుతున్న ఒక బస్సు సీటులో కుక్క మలం ఉంచుతాడు. ఆ ఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు అవుతుంది. ఆ తర్వాత చాలా మంది అక్కడ ఇస్తాంబుల్‌లో అందరికి సుపరిచితమైన వీధి కుక్క అయిన బోజీ పనిగా భావిస్తారు. అయితే ఇస్తాంబుల్ మునిసిపాలిటీ ప్రతినిధి మురత్ ఒంగున్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడుతుంది.

దీంతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటూ దుష్ప్రచారంతో మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లును చెడుగా చూపించేందుకే ఇలా చేస్తున్నారంటూ అక్కడ స్థానిక మీడియా చెబుతోంది. అంతేకాదు గతంలో మేయర్‌ పరువు తీయడానికి జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (ఎకెపి) అనేక ప్రయత్నాలు చేసిందని వెల్లడించింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటజన్లు సిగ్గుతెచ్చుకోండి మరీ ఇలాంటి పనుల చేస్తారా అంటూ ఆ వ్యక్తి పై మండిపడుతూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: ఇంట్లో వీల్‌చైర్‌లా... బయట స్కూటీలా)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top