Covid Side Effects కోవిడ్‌ సోకితే అవయవాలు దెబ్బతినడమే కాదు ఎముకలు సైతం!

Animal Study Suggests Covid Infection May Induce Severe Bone Loss - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19(సార్స్‌–కోవ్‌–2) వైరస్‌ సోకితే శరీరంలో అవయవాలు దెబ్బతినడమే కాదు ఎముకలు సైతం కొంత అరిగిపోతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ పరిశోధనలో తేలింది. కరోనా బారినపడి చికిత్స పొందుతున్నప్పుడు, తర్వాత కోలుకుంటున్న సమయంలో కూడా ఎముకల క్షయాన్ని గుర్తించారు. కరోనా వైరస్‌ సోకిన ఎలుకలపై (సిరియన్‌ హామ్‌స్టర్స్‌) పరిశోధన చేసి, ఈ విషయాన్ని నిర్ధారించారు.

ఈ ఫలితాలను నేచరల్‌ కమ్యూనికేషన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు.  కరోనా బారినపడిన ఎలుకల్లోని ఎముకల ధృఢత్వాన్ని త్రీ–డైమెన్షనల్‌ మైక్రో కంప్యూటరైజ్డ్‌ టోమోగ్రఫీ స్కాన్‌ ద్వారా విశ్లేషించారు. ఆయా ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫేట్‌ కొంత క్షీణించిందని పరి శోధకులు చెప్పారు. ఎముకలు 20 నుంచి 50 శాతం దాకా క్షయానికి గురైనట్లు తెలిపారు.  
చదవండి👇
మంకీపాక్స్‌: 20 దేశాల్లో 200 కేసులు.. కమ్యూనిటీ స్ప్రెడ్‌ చెందొచ్చు, కానీ..-డబ్ల్యూహెచ్‌వో
మహిళా సీఈవోలకు జీతం పెరిగింది కానీ..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top