సమస్యలకు నిలయంగా మారిన సంక్షేమ హాస్టళ్లపై 2014లో ‘సాక్షి’ విజిట్ నిర్వహించి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లింది. చంపాపేట, ఐఎస్‌సదన్, సైదాబాద్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌ను విజిట్ చేసి శిథిలావస్థకు చేరిన అద్దె భవనాలు, ఇరుగు గదులు, అస్తవ్యస్తంగా మారిన బాత్‌రూమ్‌లు తదితర సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపింది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో విద్యార్థులు సాక్షికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సంక్షేమ హాస్టళ్ల ‘విజిట్’