
పెట్రోల్ బంక్‌ల్లో హైటెక్ టెక్నాలజీ ట్యాంపరింగ్‌తో మెజర్‌మెంట్‌లో మోసాలకు జరుగుతున్నాయంటూ సాంకేతిక ఆధారాలతో క్షేత్రస్థాయి పరిశోధనాత్మక కథనం 2021 జూలై 5న ప్రచురితం కావడంతో తూనికలు, కొలతల శాఖ అధికారులు స్పందించారు. పలు పెట్రోల్ బంక్‌లపై దాడులు జరిపారు. డిస్పెన్సరీ యూనిట్ల టెక్నాలజీకి అనుగుణంగా అప్‌డేషన్ మెకానిజంతో ట్యాంపరింగ్ జరిగినట్లు మొదటిసారి గుర్తించారు. అప్పటి నుంచి పెట్రోల్ బంక్‌ల టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. దీంతో కొంత మేరకు ఆధునిక సాంకేతిక మోసాలకు కట్టడి పడింది.