సాక్షి, నెట్‌వర్క్: భాగ్యనగరానికి జనగళమై నిలిచింది. పట్నవాసుల సమస్యలకు పట్టం కట్టింది. పాలక పక్షాలను ప్రశ్నించే అక్షర శస్త్రాలను సంధించింది. గుండె గొంతుకలోని గోడును ప్రతిబింబించింది. నగర జీవన శైలిని కళ్లకు కట్టింది. యువతరానికి కరదీపికలా మారింది. నవతరానికి నాందీ వాచకమైంది. అతివలకు అండగా నిలిచింది. అసహాయులకు ఆలంబన అయింది. అధికార యంత్రాంగానికి సింహ స్వప్నమైంది. మానవీయ కథనాలకు మూలస్థానమైంది. బాధామయ గాథలను వెలుగులోకి తెచ్చింది. వాస్తవీకతను ప్రోది చేసి స్ఫూర్తిదాయకమైంది. సిటీ గళసీమపై హారంలా నిలిచి.. ఇలా ఎన్నో.. అంశాలను గుదిగుచ్చి.. 15 వసంతాలుగా నిత్యనూతనమైన వార్తా కథనాలతో నగరవాసుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది ‘సాక్షి’. సిటీజనుల మనస్సాక్షి!