
జేటిసీ రమేష్‌తో సమీక్షిస్తున్న ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జి.సుధీర్‌బాబు
ఆర్టీఏ అధికారులకు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జి.సుధీర్‌బాబు సూచన
హిమాయత్‌నగర్: డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన, ఇతర కారణాలతో డ్రైవింగ్ లైసెన్సులు రద్దయిన వారిని ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గుర్తించాల్సిన అవసరం ఉందని నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జి.సుధీర్‌బాబు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన కార్యాలయంలో రవాణా శాఖ జాయింట్ కమిషనర్ సి.రమేష్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుఽధీర్‌బాబు మాట్లాడుతూ..వివిధ కారణాలతో డ్రైవింగ్ లైసెన్సులు రద్దయిన వారు యథేచ్చగా రోడ్లపై తిరుగుతున్నారన్నారు. వారిని కట్టడి చేసేందుకు ట్రాఫిక్, ఆర్టీఏ ఆధికారులు సంయుక్తంగా డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. లైసెన్సు రద్దు కోసం ట్రాఫిక్ పోలీసులు సిఫార్సు చేసిన వెంటనే సదరు వాహనదారుడి లైసెన్సు రద్దు చేయాలని సూచించారు. ఈ విషయంలో జాప్యం చేయరాదన్నారు. రద్దీ వేళల్లో భారీ వాహనాలు నగరంలోకి రాకుండా నియంత్రించాలన్నారు. పర్మిట్ లేకుండా వస్తున్న ఇతర ప్రాంతాలకు చెందిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇరు శాఖళు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌పై ప్రతి నెల సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.