కుషాయిగూడ: సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) చేపడుతున్న సేవాకార్యక్రమాలు ప్రశంసనీయమని ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశంసించినట్లు గురువారం సంస్థ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. సీఎస్‌ఆర్ కార్యక్రమాల్లో భాగంగా రూ. 69.66 లక్షల విలువైన ల్యాప్రోస్కోపిక్ రెండు అధునాతన యంత్రాలను సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావుకు అందజేశారు. సిద్దిపేట, గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈసీఐఎల్ ఏజీఎం మునికృష్ణ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. వేణుబాబు, పర్సనల్ ఆఫీసర్ సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి హరీష్‌రావు