
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ ఆర్.కృష్ణయ్య
రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
కాచిగూడ: కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లుకల్పించాలని, విద్య, ఉద్యోగాల్లో క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరిపిన గ్రూప్ 1 సర్వీసు పరీక్షలలో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అపంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కె.రామును నియమిస్తూ నియామకపు పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేష్, కోల జనార్ధన్ పాల్గొన్నారు.