
క్రీడోత్సవాలను ప్రారంభిస్తున్న సీపీ స్టీఫెన్ రవీంద్ర
రాయదుర్గం: గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మూడు రోజులపాటు సాగే క్రీడోత్సవాలు (5వ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2023) గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ్ నాయక్, ఇతర అధికారులతో కలిసి బెలూన్లను ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సీనియర్ ఆఫీసర్లు మొదలుకొని సిబ్బంది వరకు అందరూ ఏదో ఒక ఈవెంట్‌లో పాల్గొని క్రీడోత్సవాలను విజయవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ నిత్యం జీవితంలోనూ వ్యాయామాన్ని భాగం చేసుకోవాలన్నారు. సైబరాబాద్ పోలీసు అధికారులు యోగేష్ గౌతమ్, సింగర్ కల్మేశ్వర్ పాల్గొన్నారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న సీపీ