
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్
కేంద్రంపై సమరభేరికి బీసీలు సిద్ధం కావాలి
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని
చారిత్రాత్మక మక్కా మసీదును రంగు రంగులవిద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. శుక్రవారం ఉదయం సహార్ ప్రార్థనలతో రంజాన్ మాసం మొదటి రోజు ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి మక్కా మసీదులో ఇషాకీ నమాజ్ పూర్తి చేసిన అనంతరం ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
– చార్మినార్
సమన్వయంతో శోభాయాత్రను విజయవంతం చేద్దాం
అఫ్జల్‌గంజ్ : ఈ నెల 30న నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని వివిధ శాఖల అధికారులు, పార్టీ, సంఘాల నాయకులతో పోలీసు ఉన్నతాధికారులు కోరారు. సిద్దిఅంబర్ బజార్‌లోని తారా ఇంటర్నేషనల్ హోటల్‌లో నిర్వహించిన సమావేశానికి శోభాయాత్ర నిర్వాహకులు డాక్టర్ భగవంత్‌రావు, గోవింద్ రాఠి, ఈస్ట్‌జోన్ డీసీపీ సునీల్ దత్, వెస్ట్‌జోన్ డీసీపీ కర్నె ప్రభాకర్ హాజరై పలు సూచనలు చేశారు. శోభాయాత్రను పరస్పర సహకారంతో విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. గోషామహల్ ఏసీపీ సతీష్, సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
లాలాపేట: దేశ వ్యాప్తంగా బీసీ జన గణన చేపట్టాలని, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28, 29తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా, బీసీ జనగణన దీక్ష చేపట్టినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. దీనికి సంబంధించి బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన చలో ఢిల్లీ పోస్టర్‌ను గురువారం తార్నాకలోని ఓయూ ప్రొఫెసర్స్ క్వార్టర్స్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీ కుల గణన నిర్వహిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ మాట తప్పిందన్నారు. గత తొమ్మిది సంవత్సరాల బీజేపీ పాలనలో బీసీల సంక్షేమానికి చేసింది శూన్యమన్నారు. కేంద్రంలో కనీసం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలేకపోయారని విమర్శించారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా బీసీలు ఉద్యమిస్తున్నప్పటికీ కేంద్రంలోని ప్రభుత్వాలకు కనీసం చలనం లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వంపై సమరభేరి మోగించడానికి దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 28న మహాధర్నా, 29న బీసీ గణన దీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మ పాల్గొన్నారు.



మంత్రి హరీష్‌రావుకు ల్యాప్రొస్కోిపిక్ యంత్రాలను అందజేస్తున్న ఈసీఐఎల్ సిబ్బంది

సమావేశంలో మాట్లాడుతున్న ఈస్ట్‌జోన్ డీసీపీ సునీల్ దత్