● ఐదు రోజులు.. 481 దస్తావేజులు
● ఖజానాకు భారీగా ఆదాయం
కాజీపేట అర్బన్: ఆషాఢ మాసంలోనూ రిజిస్ట్రేషన్ల జోరు తగ్గడం లేదు. వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కా ర్యాలయంలో భూక్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్లకు ఆసక్తి కనబరుస్తున్నారు. సాధారణంగా ఈ మాసంలో శుభకార్యాలు, నివాస స్థలాలు, ఇళ్లు, అ పార్ట్‌మెంట్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూప రు. కానీ, ఇందుకు భిన్నంగా వరంగల్ ఆర్వోలో స్లాట్స్ బుకింగ్‌కు పోటీ పడుతున్నట్లు సమాచారం.
రూ.రెండు కోట్ల ఆదాయం..
ఆషాఢ మాసం ఈనెల 14 నుంచి ఆగస్టు 12 వరకు ఉంటుంది. ఈ మాసం ప్రారంభమైన ఐదు రోజుల్లోనే 481 దస్తావేజులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాయి. వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 108 స్లాట్ బుకింగ్స్ రిజిస్ట్రేషన్‌కు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ప్రతి రోజు 60 నుంచి 70 దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేస్తారు. 80 నుంచి 100కు పైగా దస్తావేజులు ప్రతిరోజు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో ఐదు రోజుల్లో ఖజానాకు సుమారు రెండు కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం.
తేదీలు


