రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్
హరి చందన దాసరి
హన్మకొండ అర్బన్: ఎస్‌ఐఆర్‌ను పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, శక్తి శాఖ కార్యదర్శి హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి బాలసముద్రం శ్రీనివాసకాలనీ ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను శనివారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెల్ప్‌డెస్క్‌ల పనితీరు, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, నమోదు, డిజిటలైజేషన్ పురోగతిని పరిశీలించిన హరి చందన దాసరి.. బూత్‌స్థాయి అధికారులతో మాట్లాడి పలు అంశాలపై ఆరా తీశారు. ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, జగత్‌సింగ్ పాల్గొన్నారు.
ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలి
కాశిబుగ్గ: రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించాలని రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, కార్మిక, ఉపాధి, శిక్షణ అండ్ ఫ్యాక్టరీల శాఖ (శక్తి) సెక్రటరీ దాసరి హరిచందన అన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి వరంగల్ లేబర్ కాలనీలోని ఈఎస్‌ఐ ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆమె సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులను కలిసి, వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలు, మందుల సరఫరా, వైద్య సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ కాంతిసాగర్ ఉన్నారు.


