● భాస్కర్ అంతిమయాత్రలో ఉద్రిక్త వాతావరణం
● అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సీనపెల్లి భాస్కర్(30)ను హైదరాబాద్‌లో ఇదే గ్రామానికి చెందిన వారు హత్య చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో భాస్కర్ మృతదేహం బుధవారం రాత్రి గ్రామానికి చేరుకోగా గురువారం దహన సంస్కారాలకు కుటుంబీకులు ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశారు. పలు దళిత సంఘాలు సంఘీభావం పలికి భాస్కర్ అంతిమయాత్రలో పాల్గొన్నాయి. భాస్కర్ కుటుంబానికి న్యా యం జరిగే వరకూ పోరాటం చేస్తామని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. కాగా, పోలీసు బందోబస్తు మధ్య భాస్క ర్ అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి.


