నేటినుంచి నవోదయలో అథ్లెటిక్స్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి నవోదయలో అథ్లెటిక్స్‌ పోటీలు

Jul 17 2026 12:52 AM | Updated on Jul 17 2026 12:52 AM

మామునూరు : వరంగల్‌ మామునూరు జవహర్‌ నవోదయ విద్యాలయంలో 17,18 తేదీల్లో క్లస్టర్‌ లెవెల్‌ అథ్లెటిక్స్‌ పోటీలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు అట్టహాసంగా ప్రారంభం కానున్న ఈ పోటీల సందర్భంగా మైదాన్నాన్ని ముస్తాబు చేశారు. దీంతో క్రీడాకారులు ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. కాగా, గురువారం ఉదయం కరీంనగర్‌, ఆదిలాబాద్‌, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, ఖమ్మం, జగిత్యాల, నల్లగొండ, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన సుమారు 130 మంది క్రీడాకారులు నవోదయ ప్రాంగణానికి చేరుకుని ప్రాక్టీస్‌ చేశారు. దీంతో క్రీడాకారులతో మైదానంలో సందడి నెలకొంది. కాగా, ఇక్కడ రాణించే క్రీడాకారులు ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు కర్నాటకలోని మైసూర్‌ నవోదయ క్రీడామైదానంలో జరిగే రీజనల్‌ అథ్లెటిక్‌ పోటీల్లో పాల్గొననున్నట్లు ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

రెండు రోజుల పాటు నిర్వహణ

130 మంది క్రీడాకారుల హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement